Courtesy BCCI
ఎట్టకేలకు ఐపీఎల్ ట్రోఫీని సాధించామని ఆనందంలో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ టీమ్, వారి ఫ్యాన్స్‌కు ఊహించని షాక్ తగిలింది. తొలిసారి ఐపీఎల్ కప్పును గెలవడంతో బెంగళూరు నగరంలో ఆర్‌సీబీ టీమ్‌తో విక్టరీ పరేడ్ నిర్వహించాలని ఆర్‌సీబీ మేనేజ్‌మెంట్ భావించింది. ఈ క్రమంలోనే ఈ రోజు (బుధవారం) మధ్యాహ్నం 3.30 గంటలకు విక్టరీ పరేడ్‌ను, సాయంత్రం 6 గంటలకు చిన్నస్వామి స్టేడియంలో సెలబ్రేషన్స్ ప్లాన్ చేశారు.
🚨 RCB Victory Parade in Bengaluru ‼️
This one’s for you, 12th Man Army.
For every cheer, every tear, every year.
𝐋𝐨𝐲𝐚𝐥𝐭𝐲 𝐢𝐬 𝐑𝐨𝐲𝐚𝐥𝐭𝐲 𝐚𝐧𝐝 𝐭𝐨𝐝𝐚𝐲, 𝐭𝐡𝐞 𝐜𝐫𝐨𝐰𝐧 𝐢𝐬 𝐲𝐨𝐮𝐫𝐬.🏆More details soon… pic.twitter.com/fMWuCGkVWX
— Royal Challengers Bengaluru (@RCBTweets) June 4, 2025
అయితే.. పోలీసులు పెద్ద షాక్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. విక్టరీ పరేడ్‌కు బెంగళూరు పోలీసులు అనుమతి ఇవ్వలేదని సమాచారం. వర్కింగ్ డే కావడంతో నగరంలో ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుందని చెప్పారట. ఈ క్రమంలో విక్టరీ పరేడ్‌ను రద్దు చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ వార్త విన్న ఆర్‌సీబీ అభిమానులు నిరాశను వ్యక్తం చేస్తున్నారు.
🚨 OPEN BUS PARADE CANCELLED. 🚨
– The open bus Parade planned by RCB in Bengaluru has been cancelled due to heavy traffic congestion in the city. pic.twitter.com/LpGL8lJG5h
— Mufaddal Vohra (@mufaddal_vohra) June 4, 2025
ఇప్పుడు కేవలం చిన్నస్వామి స్టేడియంలో సెలబ్రేషన్స్ మాత్రమే నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి పాసులు ఉన్నవారినే అనుమతించనున్నారు. పార్కింగ్ సమస్య తలెత్తకుండా ప్రజా రవాణాను ఉపయోగించుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. బెంగళూరులోని సీబీడీ ప్రాంతం వైపు మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 8 గంటల వరకు వెళ్లకపోవడమే మంచిదని సాధారణ ప్రజలకు పోలీసులు సూచించారు.