WTC 2023-25 Team of the Tournament : డబ్ల్యూటీసీ 2023-25 టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్.. భారత్ నుంచి ఇద్దరికే చోటు..
క్రికెట్ ఆస్ట్రేలియా బుధవారం డబ్ల్యూటీసీ 2023-25 టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్‌ను ప్రకటించింది.

WTC 2023-25 Team of the Tournament
ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) 2023-25 ఫైనల్ మ్యాచ్ జూన్ 11-15 వరకు లండన్‌లోని లార్డ్స్ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్‌తో డబ్ల్యూటీసీ మూడో సైకిల్ ముగుస్తుంది. ఈ ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు టెస్టు ఛాంపియన్ షిప్ గద కోసం పోటీపడనున్నాయి.
ఈ నేపథ్యంలో క్రికెట్ ఆస్ట్రేలియా బుధవారం డబ్ల్యూటీసీ 2023-25 టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్‌ను ప్రకటించింది. మూడో సైకిల్‌లో రాణించిన ఆటగాళ్లతో కూడిన ఎలెవన్‌ను ప్రకటించింది. ఈ జట్టును ప్రకటించేందుకు కేవలం ఆటగాళ్ల గణాంకాల పైన మాత్రమే ఆధారపడలేదు. వివిధ పరిస్థితుల్లో ఆటగాళ్లు చూపిన ప్రదర్శన ఆధారంగా జట్టును ఎంపిక చేసినట్లు తెలిపింది.
ఈ జట్టులో భారత్ కు చెందిన ఇద్దరు ఆటగాళ్లు చోటు దక్కించుకున్నారు. ఇందులో ఒకరు యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ కాగా.. రెండో ఆటగాడు జస్‌ప్రీత్ బుమ్రా.
డబ్ల్యూటీసీ మూడో సైకిల్‌లో జైస్వాల్ 19 టెస్టులు ఆడి 1798 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు శతకాలు, 10 అర్థశతకాలు ఉన్నాయి. మరోవైపు బుమ్రా 15 టెస్టులు ఆడి 77 వికెట్లు తీశాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 32 వికెట్లు పడగొట్టాడు.
We’ve named our WTC cycle best XI – have we got it spot on?
See the rationale behind the selections here: https://t.co/Xr48HYRTD3 pic.twitter.com/VCE0JXLWNx
— cricket.com.au (@cricketcomau) June 3, 2025
ఆస్ట్రేలియాకు చెందిన పాట్ కమిన్స్ కెప్టెన్‌గా ఎంపిక అయ్యాడు. ఆసీస్‌కే చెందిన ఉస్మాన్ ఖవాజా, అలెక్స్ కేరీలు కూడా జట్టులో చోటు దక్కించుకున్నారు. న్యూజిలాండ్ నుంచి కేన్ విలిమయ్సన్, మాట్ హెన్రీలు చోటు దక్కించుకోగా ఇంగ్లాండ్ నుంచి జోరూట్ , హ్యారీ బ్రూక్‌లు అవకాశం దక్కించుకున్నారు. ఇక శ్రీలంక నుంచి కమిందు మెండిస్, పాక్ నుంచి నోమన్ అలీలు జట్టులో చోటు దక్కించుకున్నారు.
Krunal Pandya : చరిత్ర సృష్టించిన కృనాల్ పాండ్యా.. ఐపీఎల్ చరిత్రలో ఒకే ఒక్కడు..
క్రికెట్ ఆస్ట్రేలియా WTC 2023-25 టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్ జట్టు ఇదే..
యశస్వి జైస్వాల్, ఉస్మాన్ ఖవాజా, కేన్ విలియమ్సన్, జో రూట్, హ్యారీ బ్రూక్, కమిందు మెండిస్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), పాట్ కమిన్స్ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా, మాట్ హెన్రీ, నోమన్ అలీ,
కగిసో రబాడను 12వ ఆటగాడిగా తీసుకుంది.