SA vs PAK : అది స్టేడియం అనుకున్నారా ఇంకేమైనానా..? ఓ వైపు మ్యాచ్ జ‌రుగుతుంటే.. గ్రౌండ్‌లోనే బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన మ‌హిళ‌.. ఇంకా..

ఓ వైపు మైదానంలో మ్యాచ్ జ‌రుగుతుండ‌గా మ‌రో వైపు స్టేడియంలో ప‌లు ఆస‌క్తిక‌ర ఘ‌ట‌నలు చోటు చేసుకున్నాయి.

The Wanderers Stadium witnesses the birth of a baby boy and an engagement during the Pink ODI

ద‌క్షిణాఫ్రికా గ‌డ్డ పై పాకిస్థాన్ జ‌ట్టు చ‌రిత్ర సృష్టించింది. వ‌న్డే సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. ఈ క్ర‌మంలో ద‌క్షిణాప్రికా గ‌డ్డ‌పై స‌ఫారీల‌ను వ‌న్డేల్లో క్లీన్ స్లీప్ చేసిన తొలి జ‌ట్టుగా పాకిస్థాన్ రికార్డుల‌కు ఎక్కింది. ఆదివారం జ‌రిగిన మూడో వ‌న్డే మ్యాచులో పాకిస్థాన్ 42 ప‌రుగుల తేడాతో గెలుపొందింది.

జొహన్నస్‌బర్గ్‌లో మూడో వ‌న్డే మ్యాచ్ జ‌రిగింది. వ‌ర్షం వ‌ల్ల ఈ మ్యాచ్‌ను 47 ఓవ‌ర్ల‌కు కుదించారు. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 47 ఓవ‌ర్ల‌ల‌లో 9 వికెట్లు కోల్పోయి 308 ప‌రుగులు చేసింది. పాక్ బ్యాట‌ర్ల‌లో ఓపెనర్‌ సయీమ్‌ అయూబ్ (101) శతకంతో చెల‌రేగాడు. బాబర్‌ ఆజం(52), కెప్టెన్‌ మహ్మద్‌ రిజ్వాన్‌(53) లు అర్థ‌శ‌త‌కాల‌తో రాణించారు. స‌ఫారీ బౌల‌ర్ల‌లో కగిసో రబడ మూడు వికెట్లు తీశాడు. మార్కో జాన్సెన్‌ రెండు వికెట్లు ప‌డ‌గొట్టాడు. క్వెనా మఫాకా, కార్బిన్‌ బాష్ చెరో వికెట్ సాధించారు.

Virat Kohli : ఓ తండ్రి త‌న కుమారుడికి కోహ్లీని ఎలా ప‌రిచ‌యం చేస్తున్నాడో చూశారా? అటు చూడు.. అత‌డే..

అనంత‌రం లక్ష్య ఛేదనలో ద‌క్షిణాఫ్రికా త‌డ‌బ‌డింది. 42 ఓవ‌ర్ల‌లో 271 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. స‌ఫారీ బ్యాట‌ర్ల‌లో హెన్రిచ్ క్లాసెన్ (81) ఒక్క‌డే పోరాడాడు. పాక్‌ బౌలర్లలో సూఫియాన్‌ ముకీం నాలుగు వికెట్లు ప‌డ‌గొట్టాడు. షాహిన్‌ ఆఫ్రిది, నసీం షా చెరో రెండు వికెట్లు తీశారు. మహ్మద్‌ హొస్నేన్‌, సయీమ్‌ ఆయుబ్ చెరో వికెట్ సాధించారు.

ఓ ప‌క్క మ్యాచ్ జ‌రుగుతుంటే..?

ఓ వైపు మైదానంలో మ్యాచ్ జ‌రుగుతుండ‌గా మ‌రో వైపు స్టేడియంలో ప‌లు ఆస‌క్తిక‌ర ఘ‌ట‌నలు చోటు చేసుకున్నాయి. ఓ మ‌హిళ వాండ‌ర్స్ స్టేడియంలోని మెడిక‌ల్ సెంట‌ర్‌లో ఓ మగ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది.

ఇది జ‌రిగిన కొద్ది సేప‌టికే ఓ ప్రియుడు త‌న ప్రియురాలికి మోకాలిపై కూర్చోని ప్ర‌పోజ్ చేశాడు. అంతేనా.. ఏకంగా ఎంగేజ్‌మెంట్ రింగ్ తొడిగేశాడు.

ఇందుకు సంబంధించిన ఫోటోలు వైర‌ల్‌గా మారాయి. దీనిపై నెటిజ‌న్లు ఫ‌న్నీ కామెంట్లు చేస్తున్నారు. అది స్టేడియం అనుకున్నారా? లేక మ‌రేదైనా అని అనుకున్నారా అంటూ స‌ర‌దాగా వ్యాఖ్యానిస్తున్నారు.

IND vs ENG : భార‌త్‌తో వ‌న్డే, టీ20 సిరీస్‌కు ఇంగ్లాండ్ జ‌ట్టు ప్ర‌క‌ట‌న‌.. అత‌డొచ్చేశాడు..