ENG vs IND : భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు వీరే..
భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఇప్పటి వరకు జరిగిన టెస్టు మ్యాచ్‌ల్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్లు ఎవరో ఓ సారి చూసేద్దాం.

TOP 5 batters with most runs between India and England Test series
భారత్ జట్టు ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లింది. ఈ పర్యటనలో టీమ్ఇండియా ఆతిథ్య ఇంగ్లాండ్‌తో 5 మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడనుంది. శుభ్‌మన్ గిల్ సారథ్యంలో భారత్ బరిలోకి దిగనుంది. ఇక ఈ సిరీస్ జూన్ 20 నుంచి ప్రారంభం కానుంది. ఈ క్రమంలో భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఇప్పటి వరకు జరిగిన టెస్టు మ్యాచ్‌ల్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్లు ఎవరో ఓ సారి చూసేద్దాం.
జోరూట్..
భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన టెస్టు మ్యాచ్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడి రికార్డు జోరూట్ పేరిట ఉంది. ఇప్పటి వరకు జోరూట్ భారత్ పై 30 టెస్టులు ఆడాడు. 55 ఇన్నింగ్స్‌ల్లో 58.08 సగటుతో 2846 పరుగులు చేశాడు. ఇందులో 10 శతకాలు, 11 అర్థశతకాలు ఉన్నాయి.
ENG-L vs IND-A : కేఎల్ రాహుల్ శతకం.. 348 పరుగులకు భారత్ ఏ ఆలౌట్..
సచిన్ టెండూల్కర్..
ఈ జాబితాలో భారత దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ రెండో స్థానంలో నిలిచాడు. ఇంగ్లాండ్ పై సచిన్ 32 టెస్టులు ఆడాడు. 51.73 సగటుతో 2535 పరుగులు చేశాడు. ఇందులో 7 సెంచరీలు, 13 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
సునీల్ గవాస్కర్..
ఈ జాబితాలో సునీల్ గవాస్కర్ మూడో స్థానంలో ఉన్నాడు. ఇంగ్లాండ్ గవాస్కర్ 38 టెస్టులు ఆడాడు. 38.20 సగటుతో 2483 పరుగులు చేశాడు. ఇందులో 4 శతకాలు, 16 అర్థశతకాలు ఉన్నాయి.
అలిస్టర్ కుక్..
ఈ జాబితాలో ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ అలిస్టర్ కుక్ నాలుగో స్థానంలో నిలిచాడు. కుక్ భారత్ పై 30 టెస్టులు ఆడాడు. 54 ఇన్నింగ్స్‌ల్లో 47.66 సగటుతో 2431 పరుగులు చేశాడు. ఇందులో 7 శతకాలు, 9 అర్థశతకాలు ఉన్నాయి.
విరాట్ కోహ్లీ..
ఇక ఈ జాబితాలో విరాట్ కోహ్లీ ఐదో స్థానంలో నిలిచాడు. ఇంగ్లాండ్ పై కోహ్లీ 28 టెస్టులు ఆడాడు. 42.36 సగటుతో 1991 పరుగులు చేశాడు. ఇందులో 5 శతకాలు, 9 అర్థశతకాలు ఉన్నాయి.