పరుగుల వరద పారించిన సన్‌రైజర్స్ హైదరాబాద్

ఢిల్లీ జట్టులో కుల్దీప్ 4, ముకేశ్ కుమార్, అక్షర్ పటేల్ ఒక్కో వికెట్ చొప్పున తీశారు. 

ఢిల్లీ క్యాపిటల్స్ పై సన్‌రైజర్స్ హైదరాబాద్ పరుగుల వరద పారించింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో భాగంగా ఇవాళ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతున్న 35వ మ్యాచ్‌లో నిర్ణీత 20 ఓవర్లకు 7 వికెట్ల నష్టానికి సన్‌రైజర్స్ హైదరాబాద్ 266 పరుగులు చేసింది.

ఓపెనర్ ట్రావిస్ హెడ్ దుమ్మురేపాడు. క్రీజులోకి రావడమే ఆలస్యం సిక్సులు, ఫోర్ల వర్షం కురిపించాడు. 32 బంతుల్లో 89 బాదాడు. దీంతో హైదరాబాద్ స్కోరు 300 దాటుతుందని అందరూ భావించారు. అయితే, కుల్దీప్ యాదవ్ బౌలింగ్ లో 89 పరుగుల వద్ద హెడ్ ఔట్ అయ్యాడు.

సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లలో అభిషేక్ శర్మ 46, ఐడెన్ మార్క్రామ్ 1, హెన్రిచ్ క్లాసెన్ 15, నితీశ్ రెడ్డి 37, అబ్దుల్ సమద్ 13 పరుగులు చేసి ఔటయ్యారు. షాబాజ్ అహ్మద్ చివర్లో మెరుపులు మెరిపించి 53 బాది నాటౌట్ గా నిలిచాడు. ప్యాట్ కమ్మిన్స్ 1 (నాటౌట్) పరుగు చేశాడు. ఢిల్లీ జట్టులో కుల్దీప్ 4, ముకేశ్ కుమార్, అక్షర్ పటేల్ ఒక్కో వికెట్ చొప్పున తీశారు.

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు
అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఐడెన్ మార్క్రామ్, హెన్రిచ్ క్లాసెన్, అబ్దుల్ సమద్, నితీష్ రెడ్డి, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, నటరాజన్

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు
డేవిడ్ వార్నర్, జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్, అభిషేక్ పోరెల్, రిషబ్ పంత్, ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, లలిత్ యాదవ్, కుల్దీప్ యాదవ్, అన్రిచ్ నార్ట్జే, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్

DC vs SRH : ట్రావిస్ హెడ్‌ బాదుడే బాదుడు.. ఐపీఎల్ చ‌రిత్ర‌లోనే ప‌వ‌ర్ ప్లేలో అత్య‌ధిక స్కోరు..

ట్రెండింగ్ వార్తలు