DC vs SRH : ట్రావిస్ హెడ్‌ బాదుడే బాదుడు.. ఐపీఎల్ చ‌రిత్ర‌లోనే ప‌వ‌ర్ ప్లేలో అత్య‌ధిక స్కోరు..

ఐపీఎల్ 17వ సీజ‌న్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ ఓపెన‌ర్లు దంచికొడుతున్నారు

DC vs SRH : ట్రావిస్ హెడ్‌ బాదుడే బాదుడు.. ఐపీఎల్ చ‌రిత్ర‌లోనే ప‌వ‌ర్ ప్లేలో అత్య‌ధిక స్కోరు..

pic credit @srh

ఐపీఎల్ 17వ సీజ‌న్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ ఓపెన‌ర్లు దంచికొడుతున్నారు. రికార్డుల మీద రికార్డులు బ‌ద్ద‌లు కొడుతున్నారు. ఇప్ప‌టికే రెండు సార్లు ఐపీఎల్ చ‌రిత్ర‌లోనే అత్య‌ధిక స్కోర్లు బాదారు. తాజాగా ఢిల్లీలోని అరుణ్‌జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో మ్యాచ్‌లో ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగుతున్నారు. ఐపీఎల్‌ చ‌రిత్ర‌లోనే అత్య‌ధిక ప‌వ‌ర్ ప్లే స్కోరును న‌మోదు చేశారు.

ఓవ‌ర్‌కు దాదాపు 21 ర‌న్‌రేట్‌ చొప్పున ప‌రుగులు రాబ‌ట్టాడు. కేవ‌లం ఆరు ఓవ‌ర్ల‌లో వికెట్ న‌ష్ట‌పోకుండా 125 ప‌రుగులు చేశారు. ట్రావిస్ హెడ్ 84 ( 26 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్స‌ర్లు), అభిషేక్ శ‌ర్మ 40 (10 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స‌ర్లు) ప‌రుగులు చేశారు.

Gautam Gambhirm : గంభీర్ మీ న‌వ్వు బాగుంది.. నా భార్య కూడా ఎప్పుడూ ఇలా చెప్ప‌లేదురా అయ్యా..

ప‌వ‌ర్ ప్లేలో అత్య‌ధిక ప‌రుగుల రికార్డు గ‌తంలో కేకేఆర్ పేరిట ఉండేది. 2017లో ఆర్‌సీబీతో మ్యాచ్‌లో కేకేఆర్ ప‌వ‌ర్ ప్లేలో వికెట్ న‌ష్ట‌పోకుండా 105 ప‌రుగులు చేసింది.

ఐపీఎల్‌లో ప‌వ‌ర్ ప్లేలో అత్యధిక స్కోర్లు..
125/0 – SRH vs DC, 2024*
105/0 – KKR vs RCB, 2017
100/2 – CSK vs PBKS, 2014
90/0 – CSK vs MI, 2015
88/1 – KKR vs DC, 2024