Trent Boult : చ‌రిత్ర సృష్టించిన ట్రెంట్ బౌల్ట్‌.. మొద‌టి ఓవ‌ర్‌లో అత్య‌ధిక వికెట్లు..

రాజ‌స్థాన్ రాయ‌ల్స్ స్టార్ బౌల‌ర్ ట్రెంట్ బౌల్ట్ చ‌రిత్ర సృష్టించాడు.

Trent Boult : చ‌రిత్ర సృష్టించిన ట్రెంట్ బౌల్ట్‌.. మొద‌టి ఓవ‌ర్‌లో అత్య‌ధిక వికెట్లు..

Trent Boult creates history Most wickets in first over in IPL

Updated On : April 22, 2024 / 8:00 PM IST

Trent Boult creates history : రాజ‌స్థాన్ రాయ‌ల్స్ స్టార్ బౌల‌ర్ ట్రెంట్ బౌల్ట్ చ‌రిత్ర సృష్టించాడు. ఐపీఎల్‌లో మొద‌టి ఓవ‌ర్‌లో అత్య‌ధిక వికెట్లు తీసిన ఆట‌గాడిగా రికార్డుల‌కు ఎక్కాడు. సోమ‌వారం జైపూర్‌లోని స‌వాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో ముంబై ఇండియ‌న్స్‌తో మ్యాచ్‌లో బౌల్ట్ ఈ ఘ‌న‌త‌ను అందుకున్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ రికార్డు స‌న్‌రైజ‌ర్స్ ఆట‌గాడు భువ‌నేశ్వ‌ర్ కుమార్ పేరిట ఉండేది. ముంబైతో మ్యాచ్‌లో ఓపెన‌ర్ రోహిత్ శర్మ‌ను ఔట్ ద్వారా భువీ రికార్డును బౌల్ట్ బ‌ద్ద‌లు కొట్టాడు.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై బ్యాటింగ్ ఎంచుకుంది. రోహిత్ శ‌ర్మ‌, ఇషాన్ కిష‌న్‌లు ఓపెన‌ర్లుగా బ‌రిలోకి దిగారు. మొద‌టి ఓవ‌ర్‌ను బౌల్ట్ వేశాడు. రెండో బంతిని రోహిత్ శ‌ర్మ ఫోర్‌గా మలిచాడు. అయితే.. ఐదో బంతికి షాట్ ఆడ‌గా ఎడ్జ్ తీసుకున్న బంతి వికెట్ కీప‌ర్ సంజూ శాంస‌న్ చేతుల్లోకి వెళ్లింది. ఐపీఎల్‌లో మొద‌టి ఓవ‌ర్‌లో బౌల్ట్‌కు ఇది 26 వికెట్ కావ‌డం విశేషం.

KKR vs RCB : ఆర్‌సీబీ ఓట‌మికి అంపైర్లే కార‌ణం.. ? ఆ రెండు ప‌రుగులు ఇచ్చుంటే..?

ఐపీఎల్‌లో మొద‌టి ఓవ‌ర్‌లో అత్య‌ధిక వికెట్లు తీసిన బౌల‌ర్లు..

ట్రెంట్ బౌల్ట్ (రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌) – 26 వికెట్లు
భువ‌నేశ్వ‌ర్ కుమార్ (స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్) – 25
ప్ర‌వీణ్‌కుమార్ – 15
సందీప్ శ‌ర్మ (రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌) – 13
దీప‌ర్ చాహ‌ర్ – 12
జ‌హీర్ ఖాన్ -12

Virat Kohli : బ్రేకింగ్‌.. విరాట్ కోహ్లికి బిగ్ షాకిచ్చిన‌ బీసీసీఐ..