KKR vs RCB : ఆర్‌సీబీ ఓట‌మికి అంపైర్లే కార‌ణం.. ? ఆ రెండు ప‌రుగులు ఇచ్చుంటే..?

ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా ఆదివారం రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు, కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ జ‌ట్ల మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్ వివాదాల‌కు కేంద్ర బిందువుగా మారుతోంది.

KKR vs RCB : ఆర్‌సీబీ ఓట‌మికి అంపైర్లే కార‌ణం.. ? ఆ రెండు ప‌రుగులు ఇచ్చుంటే..?

Did Umpire Cost RCB 2 Runs vs KKR Fans Claim So With Video Evidence

ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా ఆదివారం రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు, కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ జ‌ట్ల మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్ వివాదాల‌కు కేంద్ర బిందువుగా మారుతోంది. ఇప్ప‌టికే కోహ్లి ఔట్ విష‌యంలో దుమారం రేగ‌గా.. ఇప్పుడు అంపైర్లు త‌ప్పిదం చేశారంటూ ఓ వీడియో వైర‌ల్‌గా మారింది. అంపైర్ల త‌ప్పిదం కార‌ణంగా ఆర్‌సీబీ రెండు ప‌రుగుల‌ను కోల్పోయింద‌ని, ఈ రెండు ప‌రుగులు ఇచ్చి ఉంటే ఆర్‌సీబీ గెలిచి ఉండేదిని అంటున్నారు.

ఈ మ్యాచ్‌లో కోల్‌క‌తా మొద‌ట బ్యాటింగ్ చేసింది. కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్ (50; 36 బంతుల్లో 7ఫోర్లు, 1సిక్స్‌), ఫిల్ సాల్ట్ (48; 14 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స‌ర్లు) మెరుపులు మెరిపించ‌డంతో నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో కోల్‌క‌తా ఆరు వికెట్లు కోల్పోయి 222 ప‌రుగులు చేసింది. అనంత‌రం భారీ లక్ష్య ఛేద‌న‌లో ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 221 ప‌రుగుల‌కు ఆలౌటైంది. ఆర్‌సీబీ విజ‌యానికి ఆఖ‌రి బంతికి మూడు ప‌రుగులు అవ‌స‌రం కాగా.. ఒక్క ప‌రుగు మాత్ర‌మే వ‌చ్చింది. దీంతో ప‌రుగు తేడాతో బెంగ‌ళూరు ఓడిపోయింది.

Virat Kohli : బ్రేకింగ్‌.. విరాట్ కోహ్లికి బిగ్ షాకిచ్చిన‌ బీసీసీఐ..

సిక్స్‌ను ఫోర్‌గా..!

ఆర్‌సీబీ ఇన్నింగ్స్ సంద‌ర్భంగా ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఇన్నింగ్స్ 17వ ఓవ‌ర్‌ను కోల్‌క‌తా బౌల‌ర్ వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి వేవాడు. ఈ ఓవ‌ర్‌లోని ఐదో బంతిని ఆర్‌సీబీ బ్యాట‌ర్ ప్ర‌భుదేశాయ్ షార్ట్ ఫైన్ లెగ్ దిశ‌గా భారీ షాట్ ఆడాడు. బంతి బౌండ‌రీకి వెళ్లింది. అంపైర్లు దాన్ని ఫోర్‌గా ప్ర‌క‌టించారు. అయితే.. వాస్త‌వానికి అది సిక్స్ అని, అంపైర్లు క‌నీసం చెక్ చేయ‌కుండానే ఫోర్‌గా ప్ర‌క‌టించార‌ని ఫ్యాన్స్ ఆరోపిస్తూ ఇందుకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియో వైర‌ల్‌గా మారింది.

వాస్తవానికి.. రిఫరల్ త్వరగా జరిగినప్పటికీ ఆన్-ఫీల్డ్ నిర్ణయం గురించి థర్డ్ అంపైర్‌ తనిఖీ చేశాడు. బంతి తాడుకు ముందు బౌన్స్ అయిందని, అందుకే 4 పరుగులు మాత్రమే ఇచ్చామని థర్డ్ అంపైర్ సూచించాడు. ఈ విషయంపై మ్యాచ్ అధికారులు లేదా ఐపీఎల్ యాజమాన్యం ఇంకా స్పందించలేదు.

Viral Video : వెనుక నుంచి వ‌చ్చి రోహిత్ శ‌ర్మ‌కు ముద్దు ఇవ్వ‌బోయిన షేన్‌బాండ్‌..