×
Ad

IND VS PAK : వైభ‌వ్ సూర్య‌వంశీ విఫ‌లం, రాణించిన అరోన్ జార్జి.. పాక్ టార్గెట్ ఎంతంటే?

అండ‌ర్‌-19 ఆసియాక‌ప్ 2025లో భాగంగా దుబాయ్‌లోని ఐసీసీ అకాడ‌మీ వేదిక‌గా ఆదివారం భార‌త్‌, పాక్ జ‌ట్ల మ‌ధ్య (IND VS PAK)మ్యాచ్ జ‌రుగుతోంది.

U19 Asia Cup 2025 team india 240 all out Pakistan target is 241

IND VS PAK : అండ‌ర్‌-19 ఆసియాక‌ప్ 2025లో భాగంగా దుబాయ్‌లోని ఐసీసీ అకాడ‌మీ వేదిక‌గా ఆదివారం భార‌త్‌, పాక్ జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ జ‌రుగుతోంది. వ‌ర్షం వ‌ల్ల మ్యాచ్ కాస్త ఆల‌స్యంగా ప్రారంభమైంది. దీంతో మ్యాచ్‌ను 49 ఓవ‌ర్ల‌కు కుదించారు. టాస్ ఓడిన భార‌త్ తొలుత బ్యాటింగ్‌కు దిగింది. 46.1 ఓవ‌ర్ల‌లో 240 ప‌రుగుల‌కు కుప్ప‌కూలింది.

SMAT 2025 : య‌శ‌స్వి జైస్వాల్ సూప‌ర్ సెంచ‌రీ, స‌ర్ఫ‌రాజ్ ఖాన్ మెరుపు హాఫ్ సెంచ‌రీ.. ముంబై ఘ‌న విజ‌యం..

టీమ్ఇండియా బ్యాట‌ర్ల‌లో అరోన్‌ జార్జి (85; 88 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్స్‌) హాఫ్ సెంచ‌రీ చేశాడు. కాన్షిక్‌ చౌహాన్‌ (46; 46 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), ఆయుష్‌ మాత్రే (38; 25 బంతుల్లో, 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) లు రాణించారు.

Lionel Messi : మెస్సీ భార‌త్‌లో పూర్తి స్థాయి మ్యాచ్ ఎందుకు ఆడ‌డు? ఇన్సూరెన్స్ తో లింక్ ఏంటి?

అభిజ్ఞాన్‌ కుందు (22; 32 బంతుల్లో 1 ఫోర్‌) ప‌ర్వాలేద‌నిపించాడు. వైభ‌వ్ సూర్య‌వంశీ (5), వేదాంత్ త్రివేది (7)లు విఫ‌లం అయ్యారు. పాక్‌ బౌలర్లలో మహ్మద్ సయ్యం, అబ్దుల్ సుభాన్ చెరో మూడు వికెట్లు తీశారు. నికాబ్ షఫీక్ రెండు వికెట్లు ప‌డ‌గొట్టాడు. అలీ రజా, అహ్మద్ హుస్సేన్ లు త‌లా ఓ వికెట్ సాధించారు.