U19 World Cup 2024 : అండ‌ర్-19 ప్ర‌పంచ‌క‌ప్‌లో ఫైన‌ల్‌కు చేరిన ఆస్ట్రేలియా.. సెమీస్‌లో పాక్ పై విజ‌యం.. భార‌త్‌తో అమీతుమీ

ద‌క్షిణాఫ్రికా వేదిక‌గా జ‌రుగుతున్న అండ‌ర్‌-19 ప్ర‌పంచ‌క‌ప్‌లో ఆస్ట్రేలియా జ‌ట్టు అద‌ర‌గొట్టింది.

U19 World Cup 2024 : అండ‌ర్-19 ప్ర‌పంచ‌క‌ప్‌లో ఫైన‌ల్‌కు చేరిన ఆస్ట్రేలియా.. సెమీస్‌లో పాక్ పై విజ‌యం.. భార‌త్‌తో అమీతుమీ

U19 World Cup 2024 Australia beat Pakistan by 1 wicket and enter into final

U19 World Cup : ద‌క్షిణాఫ్రికా వేదిక‌గా జ‌రుగుతున్న అండ‌ర్‌-19 ప్ర‌పంచ‌క‌ప్‌లో ఆస్ట్రేలియా జ‌ట్టు అద‌ర‌గొట్టింది. గురువారం ఉత్కంఠ‌గా పాకిస్తాన్‌తో జ‌రిగిన సెమీ ఫైన‌ల్ మ్యాచ్‌లో విజ‌యం సాధించి ఫైన‌ల్‌కు దూసుకువెళ్లింది. 180 ప‌రుగుల ల‌క్ష్యాన్ని 49.1 ఓవ‌ర్‌లో తొమ్మిది వికెట్లు కోల్పోయి ఛేదించింది. కాగా.. భార‌త జ‌ట్టు ఇప్ప‌టికే ఫైన‌ల్‌కు చేరుకున్న సంగ‌తి తెలిసిందే. ఆదివారం టీమ్ఇండియా, ఆస్ట్రేలియా జ‌ట్లు క‌ప్పు కోసం పోటీప‌డ‌నున్నాయి.

ల‌క్ష్య ఛేద‌న‌లో త‌డ‌బ‌డి నిల‌బడిన‌ ఆసీస్‌..

180 ప‌రుగుల స్వ‌ల్ప ల‌క్ష్య ఛేద‌న‌లో ఆస్ట్రేలియా జ‌ట్టు త‌డ‌బ‌డి నిల‌బ‌డింది. ఓపెన‌ర్ సామ్ కాన్స్టాస్ (14), కెప్టెన్ హ్యూ వీబ్‌జెన్(4), హర్జాస్ సింగ్ (0), వికెట్ కీప‌ర్ ర్యాన్ హిక్స్ (0) లు విఫ‌లం కావ‌డంతో ఆస్ట్రేలియా 59 ప‌రుగుల‌కే నాలుగు వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డింది. అయితే.. మ‌రో ఓపెన‌ర్ హ్యారీ డిక్సన్ (50; 75 బంతుల్లో 5 ఫోర్లు), ఒలివర్ పీక్ (49; 75 బంతుల్లో 3 ఫోర్లు) ఇన్నింగ్స్‌ను చ‌క్క‌దిద్దే బాధ్య‌త‌ను భుజాన వేసుకున్నారు.

Gautam Gambhir : అంద‌రి ముందు ఇంగ్లాండ్ కోచ్ బ్రెండ‌న్ మెక్‌క‌ల్ల‌మ్‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పా.. గంభీర్‌

వీరిద్ద‌రు ఆచితూచి ఆడారు. మంచి బంతుల‌ను గౌర‌విస్తూ చెత్త బంతుల‌ను బౌండ‌రీల‌కు త‌ర‌లించారు. సింగిల్స్ తీస్తూ స్ట్రైకింగ్ రొటేట్ చేశారు. ల‌క్ష్యం చిన్న‌దే కావ‌డంతో ర‌న్‌రేట్ ఒత్తిడి లేక‌పోవ‌డంతో స్వేచ్ఛ‌గా బ్యాటింగ్ చేశారు. ఈ క్ర‌మంలో హాఫ్ సెంచ‌రీ పూర్తి చేసుకున్న అనంత‌రం హ్యారీ డిక్స‌న్ ఔట్ అయ్యాడు. అత‌డిని అరాఫత్ మిన్హాస్ క్లీన్ బౌల్డ్ చేశాడు. హ్యారీ డిక్సన్-ఒలివర్ పీక్ లు ఐదో వికెట్ 43 ప‌రుగులు జోడించారు.

హ్యారీ డిక్సన్ ఔటైన‌ప్ప‌టికీ ఒలివ‌ర్ పీక్‌, టామ్ కాంప్‌బెల్ (25; 42 బంతుల్లో 2 ఫోర్లు) తో క‌లిసి ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకువెళ్లాడు. వీరిద్ద‌రు ఆరో వికెట్‌కు 44 ప‌రుగుల భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పారు. ఆఖ‌ర్లో బెల్, ఒలివ‌ర్ పీక్ ఔట్ కావ‌డంతో మ్యాచులో ఉత్కంఠ చెల‌రేగింది. కల్లమ్ విడ్లర్(19నాటౌట్‌), రాఫ్ మాక్‌మిల్లన్(2 నాటౌట్‌) ఆఖ‌రి వికెట్ అజేయంగా 16 ప‌రుగులు జోడించి జ‌ట్టుకు న‌మ్మ‌శ‌క్యంగాని విజ‌యాన్ని అందించారు. పాకిస్తాన్ బౌల‌ర్ల‌లో అలీ రజా నాలుగు వికెట్లు తీశాడు. అరాఫత్ మిన్హాస్ రెండు వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఉబైద్ షా, నవీద్ అహ్మద్ ఖాన్ చెరో వికెట్ సాధించారు.

Virat Kohli : టాలీవుడ్ సూప‌ర్ స్టార్ పాట‌కు కోహ్లీ, అనుష్క‌ డ్యాన్స్ చూశారా? కానీ..

అంత‌క‌ముందు మొద‌ట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 48.5 ఓవ‌ర్ల‌లో 179 ప‌రుగుల‌కు ఆలౌటైంది. పాకిస్తాన్ బ్యాట‌ర్ల‌లో అజాన్ అవైస్ (52; 91 బంతుల్లో 3 ఫోర్లు), అరాఫత్ మిన్హాస్ (52; 61 బంతుల్లో 9ఫోర్లు) హాఫ్ సెంచ‌రీలు చేశారు. షామిల్ హుస్సేన్ (17) ఒక్క‌డే రెండు అంకెల స్కోరు చేయ‌గా మిగిలిన వారంతా సింగిల్ డిజిట్‌కే ప‌రిమితం అయ్యారు. దీంతో పాకిస్తాన్ ఓ మోస్త‌రు స్కోరుకే ప‌రిమిత‌మైంది. ఆస్ట్రేలియా బౌల‌ర్ల‌లో టామ్ స్ట్రాకర్ ఆరు వికెట్ల‌తో పాకిస్తాన్ ప‌త‌నాన్ని శాసించాడు. మహ్లీ బార్డ్‌మాన్, కల్లమ్ విడ్లర్, రాఫ్ మాక్‌మిల్లన్, టామ్ కాంప్‌బెల్ లు త‌లా ఓ వికెట్ ప‌డ‌గొట్టారు.