U19 World Cup 2026 : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్.. ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లు ఇంకా..
క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న అండర్-19 ప్రపంచకప్ (U19 World Cup 2026 ) ప్రారంభమైంది
U19 World Cup 2026 India U19 opt to bowl
U19 World Cup 2026 : క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న అండర్-19 ప్రపంచకప్ ప్రారంభమైంది. తొలి మ్యాచ్‌లో భారత్, అమెరికా జట్లు బులవాయో వేదికగా తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో భారత జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో అమెరికా తొలుత బ్యాటింగ్ చేయనుంది. ఆయుష్ మాత్రే సారథ్యంలో భారత్ బరిలోకి దిగింది.
ఐదు సార్లు 2000, 2008, 2012, 2022, 2018లో టైటిళ్లు గెలుచుకున్న భారత్ ఆరో సారి విశ్వవిజేతగా నిలవాలని ఆరాటపడుతోంది.
T20 World Cup 2026 : టీ20 ప్రపంచకప్ ముందు ఆస్ట్రేలియా కీలక నిర్ణయం.. పాక్ పర్యటన..
వాతావరణం కొద్దిగా తేమగా, మేఘావృతమై ఉంది. మేము ఈ పరిస్థితులకు ఉపయోగించుకోవాలని అనుకుంటున్నాము. అందుకనే బౌలింగ్ ఎంచుకుంటున్నాము. ఇక ఈ టోర్నీకి సన్నాహాలు కూడా బాగా జరిగాయి. ఆటగాళ్లు చాలా ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. మేము దాదాపు ఆరు నెలలుగా కలిసి ఆడుతున్నాము, కాబట్టి ఆటగాళ్లు నిజంగా నమ్మకంతో ఉన్నారు. ఇక ఈ మ్యాచ్‌లో మేము ముగ్గురు పేసర్లు, ఒక ఆల్‌రౌండర్, ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగుతున్నాము. అని ఆయుష్ మాత్రే తెలిపాడు.
భారత తుది జట్టు..
ఆయుష్ మాత్రే( కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, వేదాంత్ త్రివేది, విహాన్ మల్హోత్రా, అభిజ్ఞాన్ కుందు(వికెట్ కీపర్), హర్వాన్ష్ పంగాలియా, ఆర్ఎస్ అంబరీష్, కనిష్క్ చౌహాన్, హెనిల్ పటేల్, దీపేష్ దేవేంద్రన్, ఖిలాన్ పటేల్
IND vs NZ : ఓటమి బాధలో ఉన్న టీమ్ఇండియాకు మరో షాక్..
అమెరికా తుది జట్టు..
సాహిల్ గార్గ్, అమ్రీందర్ గిల్, అర్జున్ మహేష్(వికెట్ కీపర్), ఉత్కర్ష్ శ్రీవాస్తవ(కెప్టెన్), రిత్విక్ అప్పిడి, అద్నిత్ జంబ్, అమోఘ్ ఆరేపల్లి, నితీష్ సుదిని, శబరీష్ ప్రసాద్, అదిత్ కప్పా, రిషబ్ షింపి
