IND vs AUS: అండర్ -19 వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ ఓటమికి ప్రధాన కారణాలు ఇవే.. జై షా ఏమన్నారంటే?

భారత్ జట్టు కెప్టెన్ ఉదయ్ సహారన్ అండర్ -19 ప్రపంచకప్ ప్రారంభం నుంచి అద్భుత ఫామ్ కొనసాగించాడు. కానీ, ఫైనల్ మ్యాచ్ లో కేవలం 8 పరుగులకే ఔట్ అయ్యాడు.

U19 World Cup 2024

U19 World Cup 2024 Final : అండ‌ర్‌-19 ప్ర‌పంచ‌క‌ప్ 2024 ఫైనల్ మ్యాచ్ లో భారత్ కల చెదిరింది. వరుసగా మూడోసారి విజయం సాధించి హ్యాట్రిక్ సాధించాలని భారత్ యువ ప్లేయర్ల ఆశపడినప్పటికీ సాధ్యం కాలేదు. ఫలితంగా ఆస్ట్రేలియా జట్టు విజేతగా నిలిచింది. ఆదివారం ద‌క్షిణాఫ్రికాలోని బెనోనిలో జ‌రిగిన ఫైన‌ల్ మ్యాచ్‌లో టీమ్ఇండియాపై ఆసీస్ 79 ప‌రుగుల తేడాతో విజ‌యాన్ని సాధించింది. త‌ద్వారా నాలుగో సారి అండ‌ర్‌-19 ప్ర‌పంచ‌క‌ప్‌ను సొంతం చేసుకుంది. భారత్ టైటిల్ వేటలో ఒక అడుగు దూరంలో నిలిచిపోవటానికి పలు ప్రధాన కారణాలు ఉన్నాయి.

U19 World Cup 2024 Final

Also Read : Under-19 World Cup 2024 : అండ‌ర్‌-19 విజేత‌ ఆస్ట్రేలియా.. ఫైన‌ల్ మ్యాచ్‌లో భార‌త్ పై ఘ‌న విజ‌యం..

  • భారత్ జట్టు కెప్టెన్ ఉదయ్ సహారన్ అండర్ -19 ప్రపంచకప్ ప్రారంభం నుంచి అద్భుత ఫామ్ కొనసాగించాడు. కానీ, ఫైనల్ మ్యాచ్ లో కేవలం 8 పరుగులకే ఔట్ అయ్యాడు.
  • భారత్ బౌలర్ల ప్రదర్శన ఫైనల్ మ్యాచ్ తరహాలో లేదు. అయితే, 16పరుగుల వద్ద ఆస్ట్రేలియా తొలి వికెట్ దక్కినప్పటికీ.. ఆ తరువాత ఆస్ట్రేలియా బ్యాటర్స్ దూకుడును ఆశించిన స్థాయిలో భారత్ బౌలర్లు అడ్డుకోలేకపోయారు. ఫలితంగా పూర్తి ఓవర్లు ఆడిన ఆస్ట్రేలియా 253 పరుగులు చేసింది.
  • భారత్ జట్టు స్టార్ బ్యాటర్ ముషీర్ ఖాన్ రెండుసార్లు ఔట్ నుంచి తృటిలో తప్పించుకున్నాడు. రెండు సార్లు అవకాశం వచ్చినా ఆశించిన స్థాయిలో పరుగులు రాబట్టలేకపోయాడు. కేవలం 22 పరుగులు మాత్రమే చేసి బౌల్డ్ అయ్యాడు.
  • భారత జట్టు ఓపెనర్ ఆదర్శ్ సింగ్ 77 బంతుల్లో 47 పరుగులు చేశాడు. అయితే, ఆరంభంలో చాలా నెమ్మదిగా బ్యాటింగ్ చేయడం జట్టుపై ప్రభావం చూపింది. రాబట్టాల్సిన పరుగులు ఎక్కువగా ఉండటంతో మిగిలిన బ్యాటర్లు ఒత్తిడికి గురయ్యారు. ఫలితంగా పరుగులు రాబట్టడంలో భారత్ యువ ప్లేయర్స్ విఫలమయ్యారు.
  • భారత్ జట్టు మిడిల్ ఆర్డర్ ప్రదర్శన పేవలంగా ఉండటంకూడా జట్టు ఓటమికి ప్రధాన కారణం. ముషీర్ ఖాన్ (22), మినహా భారత్ ఇన్నింగ్స్ లో 3 నుంచి 7 వరకు ఏ బ్యాట్స్ మెన్ కూడా 10 పరుగుల మార్కును చేరుకోలేకపోయారు. ఫలితంగా టైటిల్ వేటలో భారత్ జట్టు చతికిలపడిపోయింది.
  • భారత్ జట్టు ఫైనల్ మ్యాచ్ లో ఓడినప్పటికీ అండర్ -19 వరల్డ్ కప్ లో జట్టు ప్రయాణం అద్భుతం అని చెప్పొచ్చు. సెమీఫైనల్ వరకు భారత్ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు.

 

భారత్ జట్టు ఓటమి అనంతరం బీసీసీఐ గౌరవ కార్యదర్శి జై షా ట్వీట్ చేశారు.. ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్స్‌లో మన అండర్-19 కుర్రాళ్లు ఓడిపోయినప్పటికీ, వారి ప్రయాణం చెరగని స్ఫూర్తిని మిగిల్చింది. విజయం నుండి కష్టాల వరకు, ప్రతి మ్యాచ్ బారత్ జట్టు తిరుగులేని ఆత్మ, సంకల్పం, నైపుణ్యానికి నిదర్శనంగా మారింది. జట్టులోని ప్రతిఒక్క సభ్యునికి, నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఐసీసీ అండర్ 19 ప్రపంచ కప్ ట్రోఫీని గెలుచుకున్న ఆస్ట్రేలియా అండర్ 19 జట్టుకు జైషా అభినందనలు తెలిపారు.

 

 

ట్రెండింగ్ వార్తలు