Under-19 World Cup 2024 : అండ‌ర్‌-19 విజేత‌ ఆస్ట్రేలియా.. ఫైన‌ల్ మ్యాచ్‌లో భార‌త్ పై ఘ‌న విజ‌యం..

అండ‌ర్‌-19 ప్ర‌పంచ‌క‌ప్2024 విజేత‌గా ఆస్ట్రేలియా నిలిచింది. ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అద్భుతమైన నిలకడ కొనసాగిస్తూ ఫైనల్‌ చేరిన భారత్ కు భంగ‌పాటు త‌ప్ప‌లేదు.

Under-19 World Cup 2024 : అండ‌ర్‌-19 విజేత‌ ఆస్ట్రేలియా.. ఫైన‌ల్ మ్యాచ్‌లో భార‌త్ పై ఘ‌న విజ‌యం..

Under-19 World Cup 2024 final Australia beat India

Under-19 World Cup : అండ‌ర్‌-19 ప్ర‌పంచ‌క‌ప్2024 విజేత‌గా ఆస్ట్రేలియా నిలిచింది. ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అద్భుతమైన నిలకడ కొనసాగిస్తూ ఫైనల్‌ చేరిన భారత్ కు భంగ‌పాటు త‌ప్ప‌లేదు. ఆదివారం ద‌క్షిణాఫ్రికాలోని బెనోనిలో జ‌రిగిన ఫైన‌ల్ మ్యాచ్‌లో టీమ్ఇండియాపై ఆసీస్ 79 ప‌రుగుల తేడాతో విజ‌యాన్ని సాధించింది. త‌ద్వారా నాలుగో సారి అండ‌ర్‌-19 ప్ర‌పంచ‌క‌ప్‌ను సొంతం చేసుకుంది.

గ‌తేడాది భార‌త్ వేదిక‌గా జ‌రిగిన వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2023 ఫైన‌ల్ మ్యాచులో టీమ్ఇండియా సీనియ‌ర్లు ఓడిపోగా ఇప్పుడు జూనియ‌ర్లు సైతం అదే జ‌ట్టు చేతిలోనే ఓడిపోవ‌డంతో కోట్లాది మంది అభిమానులు మ‌రోసారి తీవ్ర నిరాశ‌కు గురి అయ్యారు.

David Warner : వార్న‌ర్ మామ.. నీలో ఈ కళ కూడా ఉందా..

254 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన భార‌త్ 43.5 ఓవ‌ర్ల‌లో 174 ప‌రుగుల‌కు ఆలౌటైంది. టీమ్ఇండియా బ్యాట‌ర్ల‌లో ఆదర్శ్ సింగ్ (47; 77 బంతుల్లో 4 ఫోర్లు,1సిక్స్‌), మురుగన్ అభిషేక్ (42; 46 బంతుల్లో 5 ఫోర్లు, 1సిక్స్‌) రాణించ‌గా.. ముషీర్ ఖాన్ (22) ఫ‌ర్వాలేద‌నిపించాడు. కెప్టెన్ ఉద‌య్ స‌హ‌ర‌న్ (8), స‌చిన్ దాస్ (9), అర్షిన్ కులకర్ణి (3) ల‌తో పాటు మిగిలిన వారు ఘోరంగా విఫ‌లం కావ‌డంతో టీమ్ఇండియాకు ఓట‌మి త‌ప్ప‌లేదు. ఆసీస్ బౌల‌ర్ల‌లో మహ్లీ బార్డ్‌మాన్, రాఫ్ మాక్‌మిల్లన్ చెరో మూడు వికెట్లు తీశారు. కల్లమ్ విడ్లర్ రెండు వికెట్లు ప‌డ‌గొట్టాడు. చార్లీ ఆండర్సన్, టామ్ స్ట్రాకర్ లు చెరో వికెట్ సాధించారు.

IND vs ENG 3rd Test : టీమ్ఇండియాతో మూడో టెస్టుకు ముందు ఇంగ్లాండ్‌కు భారీ షాక్‌..

అంత‌క‌ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో ఏడు వికెట్లు కోల్పోయి 253 ప‌రుగులు చేసింది. ఆసీస్ బ్యాట‌ర్ల‌లో హర్జస్‌ సింగ్‌ (55; 64 బంతుల్లో 3 ఫోర్లు, 3సిక్స‌ర్లు) హాఫ్ సెంచ‌రీ చేశారు. హగ్‌ వెబ్జెన్‌ (48; 66 బంతుల్లో 5ఫోర్లు), ఒలివర్‌ పీక్‌ (46 నాటౌట్; 43బంతుల్లో 2ఫోర్లు, 1సిక్స్‌), హ్యారీ​ డిక్సన్‌ (42; 56 బంతుల్లో 3ఫోర్లు, 1సిక్స్‌) లు రాణించారు. సామ్‌ కాంస్టాస్ (0), రాఫ్‌ మెక్‌మిలన్ (2) విఫ‌లం అయ్యారు. భార‌త బౌల‌ర్ల‌లో రాజ్‌ లింబాని మూడు వికెట్లు ప‌డ‌గొట్టాడు. నమన్‌ తివారి రెండు వికెట్లు తీశాడు. సౌమీ పాండే, ముషీర్‌ ఖాన్ చెరో వికెట్ సాధించారు.