BAN vs UAE : బంగాదేశ్‌ ఇజ్జ‌త్ పాయె..! ప‌సికూన చేతిలో ఓట‌మి..

ప‌సికూన యూఏఈ చ‌రిత్ర సృష్టించింది.

UAE chase down 206 register first ever T20I win over Bangladesh

ప‌సికూన యూఏఈ చ‌రిత్ర సృష్టించింది. టీ20 క్రికెట్‌లో బంగ్లాదేశ్ పై తొలి విజ‌యాన్ని సాధించింది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా సోమ‌వారం షార్జా వేదిక‌గా బంగ్లాదేశ్‌తో జ‌రిగిన రెండో 20 మ్యాచ్‌లో యూఏఈ రెండు వికెట్ల తేడాతో విజ‌యాన్ని సాధించింది. దీంతో సిరీస్ ప్ర‌స్తుతం 1-1తో స‌మమైంది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. తంజిద్‌ హసన్ (33 బంతుల్లో 59 ప‌రుగులు) హాఫ్ సెంచ‌రీ చేయ‌గా తౌహిద్‌ హృదోయ్ (24 బంతుల్లో 45 ప‌రుగులు), లిటన్‌ దాస్ (32 బంతుల్లో 40 ప‌రుగులు) లు రాణించారు. యూఏఈ బౌల‌ర్ల‌లో జవదుల్లా మూడు వికెట్లు తీశాడు. సగీర్ ఖాన్ రెండు వికెట్లు తీశాడు.

LSG vs SRH : ఐపీఎల్ 2025 నుంచి ల‌క్నో ఔట్.. కెప్టెన్ రిష‌బ్ పంత్ కీల‌క వ్యాఖ్య‌లు.. దాని గురించి మాట్లాడొద్దని..

అనంతరం కెప్టెన్ ముహమ్మద్ వసీం (42 బంతుల్లో 82 ప‌రుగులు) అద్భుత ఇన్నింగ్స్ ఆడ‌గా.. మిగిలిన బ్యాట‌ర్లు త‌లా ఓ చేయి వేయ‌డంతో ల‌క్ష్యాన్ని యూఏఈ 19.5 ఓవ‌ర్ల‌లో 8 వికెట్లు కోల్పోయి అందుకుంది. బంగ్లా బౌలర్లలో షొరీఫుల్‌, నహిద్‌ రాణా, రిషద్‌ హొసేన్ త‌లా ఓ రెండు వికెట్లు తీయగా తన్వీర్‌ ఇస్లాం, తంజిమ్‌ హసన్‌ చెరో వికెట్ సాధించారు.

Shubman Gill-Sai Sudharsan : చ‌రిత్ర సృష్టించిన సాయిసుద‌ర్శ‌న్‌- గిల్ జోడీ.. ఐపీఎల్ హిస్ట‌రీలో ఏ జంట‌ అందుకోలేని ఘ‌న‌త..

ఇరు జ‌ట్ల మ‌ధ్య మూడో టీ20 మ్యాచ్ మే 21న జ‌ర‌గ‌నుంది.