Peng Shuai : చైనీస్ టెన్నిస్ స్టార్ పెంగ్ ఎక్కడ? ఐక్యరాజ్యసమితి కీలక వ్యాఖ్యలు

చైనా టెన్నిస్ స్టార్ పెంగ్ షువాయి మిస్సింగ్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇటీవల చైనా మాజీ వైస్ ప్రీమియర్(ఉన్నతాధికారి) జాంగ్ గోలీ తనను లైంగికంగా వేధించినట్లు..

Peng Shuai

Peng Shuai : చైనా టెన్నిస్ స్టార్ పెంగ్ షువాయి మిస్సింగ్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇటీవల చైనా మాజీ వైస్ ప్రీమియర్(ఉన్నతాధికారి) జాంగ్ గోలీ తనను లైంగికంగా వేధించినట్లు పెంగ్ షువాయి ఆరోపణలు చేసింది. ఆ ఆరోపణలు చేసిన గంటల వ్యవధిలోనే కనిపించకుండా పోయింది. దాంతో.. పెంగ్ షువాయికి ఏమైంది..? ఆమె ఎక్కడుంది..? అంటూ సోషల్ మీడియాలో క్రీడాకారులు ప్రశ్నిస్తున్నారు. ఆమె క్షేమ సమాచారంపై ఆందోళన వ్యక్తమవుతోంది.

ఈ వ్యవహారంపై ఐక్యరాజ్యసమితి స్పందించింది. పెంగ్ షువాయ్ ఆచూకీని రుజువు చేయాలని తెలిపింది. అంతేకాదు జాంగ్ గోలీపై పెంగ్ చేసిన ఆరోపణలపై పూర్తి పారదర్శక దర్యాప్తు కోసం ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కార్యాలయం పిలుపునిచ్చింది.

Read More..Aadhaar-BHIM : గుడ్ న్యూస్.. ఇకపై మీ ఆధార్ నెంబర్‌తో డబ్బులు పంపుకోవచ్చు!

“ఆమె ఆచూకీ, క్షేమం గురించి రుజువు కలిగి ఉండటం చాలా ముఖ్యం. ఆమె లైంగిక వేధింపుల ఆరోపణలపై పూర్తి పారదర్శకతతో విచారణ జరగాలని మేము కోరుతున్నాము” అని యూఎన్ హక్కుల చీఫ్ మిచెల్ బాచెలెట్ కార్యాలయ ప్రతినిధి లిజ్ థ్రోసెల్ అన్నారు. మాజీ ప్రపంచ డబుల్స్ నంబర్ వన్ పెంగ్ లైంగిక వేధింపులకు గురైనట్టు సోషల్ మీడియాలో ఆరోపించినప్పటి నుండి ఆమె బహిరంగంగా కనిపించ లేదు.

ఆమె ఎక్కడుందో తెలుసుకోవడం, ఆమె శ్రేయస్సు గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం అని మేము నొక్కి చెబుతాము. ఆమె ఆరోపణలపై విచారణ జరగడం చాలా ముఖ్యం అని మేము భావిస్తున్నాము. పెంగ్(35) మాజీ వింబుల్డన్, ఫ్రెంచ్ ఓపెన్ డబుల్స్ ఛాంపియన్. ఈ నెల ప్రారంభంలో చైనీస్ సోషల్ మీడియా సైట్ వీబోలో మాజీ వైస్-ప్రీమియర్ జాంగ్ తనను సెక్స్‌లో “బలవంతం” చేశాడని ఆరోపించింది. అప్పటి నుండి ఆమె కనిపించ లేదు. ఆమె శ్రేయస్సుపై ఆందోళన పెరిగింది. లైంగిక వేధింపుల బాధితులు తమ ఆరోపణలతో ముందుకు రావడం చాలా కష్టమని థ్రోసెల్ చెప్పారు.

“లైంగిక వేధింపులు ఏ సమాజంలోనైనా కనిపిస్తాయి” అని ఆమె అన్నారు. పెంగ్ షువాయ్ కేసుకు సంబంధించి, ఆమె లైంగిక వేధింపుల ఆరోపణలపై పూర్తి పారదర్శకతతో దర్యాప్తు చేయాలని మేము కోరుతున్నాము. లైంగిక వేధింపుల ఆరోపణలన్నింటిలోనూ అలానే ఉండాలి. భయంకరమైన గాయాన్ని చవిచూసిన బాధితులకు జవాబుదారీతనం, న్యాయాన్ని నిర్ధారించడం చాలా ముఖ్యం. ఇలా కేసుల్లో బాధితులు ముందుకు రావడం చాలా అరుదు. ఆరోపణలను బహిరంగపరచడం వారికి పెద్ద సవాల్” అని థ్రెసెల్ అన్నారు.

కాగా టెన్నిస్ సూపర్ స్టార్‌లు నొవాక్ జకోవిచ్, నవోమీ ఒసాకా.. పెంగ్ షువాయి ఆచూకీపై ఆందోళన వ్యక్తం చేశారు. అనూహ్యరీతిలో పెంగ్ షువాయి మిస్సింగ్‌పై స్పోర్ట్స్ సర్కిల్‌లో చర్చ జరుగుతోంది. ఇది ఇలా ఉంటే, పెంగ్ షువాయి తమకి మెయిల్ చేసిందంటూ డబ్ల్యూటీసీ ఛైర్మన్ స్టీవ్ సిమిన్‌ చెప్పినట్లు చైనా మీడియా సంస్థ ఒకటి ట్వీట్ చేసింది. పెంగ్ షువాయి పంపిన మెయిల్‌లో.. తాను క్షేమంగా ఉన్నానని చెప్పడంతో పాటు తాను చేసిన ఆరోపణలన్నీ అబద్దమని చెప్పినట్లు ఆ మీడియా సంస్థ తెలిపింది. దాంతో.. పెంగ్ షువాయి భద్రతపై మరిన్ని ప్రశ్నలు రేకెత్తాయి. ఇంత జరుగుతున్నా.. చైనా ప్రభుత్వం మాత్రం నోరు మెదపడం లేదు. దీనిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Read More Invest Grow Your Wealth: ఈ సీక్రెట్ తెలిస్తే.. రూ.10లక్షల పెట్టుబడితో రూ.100 కోట్లు ఈజీగా సంపాదించొచ్చు..!

చైనాకు చెందిన సీనియర్ రాజకీయ నేతపై ఇలాంటి ఆరోపణలు రావడం ఇదే తొలిసారి. జాంగ్ తనపై వస్తున్న ఆరోపణలపై స్పందించ లేదు. పెంగ్ పోస్టును ఇంటర్నెట్ నుంచి తొలగించారు. 2013 నుంచి 2018 మధ్య చైనా వైస్ ప్రీమియర్‌గా జాంగ్(75) పని చేశారు. ఆయన చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు అత్యంత సన్నిహితుడు. టెన్నిస్ ఆడేందుకు ఆయన ఇంటికి వెళ్లిన తర్వాత జాంగ్ తొలిసారిగా తనను బలవంతం చేశాడని పెంగ్ ఆరోపించింది.

చైనీస్ కోర్టులు ఇలాంటి కేసులను అరుదుగా విచారణకు స్వీకరిస్తాయి. లైంగిక వేధింపులను స్పష్టంగా నిర్వచించే చట్టాన్ని దేశం ఇటీవల ఆమోదించింది. తన టెన్నిస్ కెరీర్‌లో, పెంగ్ రెండు గ్రాండ్ స్లామ్ మహిళల డబుల్స్ ట్రోఫీలను గెలుచుకుంది. మొదటిది 2013లో వింబుల్డన్‌లో, రెండోది 2014లో జరిగిన రోలాండ్ గారోస్ టోర్నమెంట్‌లో. ఈ రెండూ ట్రోఫీలను తైవాన్‌కు చెందిన హ్సీహ్ సు-వీతో కలిసి ఆమె గెలుచుకుంది. పెంగ్ ఒక పెద్ద స్టార్. చైనాలో అత్యంత ప్రజాదరణ పొందిన సెర్చ్ ఇంజిన్ బైదులో ఆమె పేరును వెతికితే, 70 లక్షల కంటే ఎక్కువ ఫలితాలు కనిపిస్తాయి.