Usman Khawaja Confirms Retirement ahead of AUS vs ENG 5th test
Usman Khawaja : కొత్త సంవత్సరం ప్రారంభమై రెండు రోజులు కూడా కాలేదు అప్పుడే ఆస్ట్రేలియా జట్టుకు గట్టి షాక్ తగిలింది. టెస్టుల్లో స్టార్ ఓపెనర్ అయిన ఉస్మాన్ ఖవాజా రిటైర్‌మెంట్ ప్రకటించాడు. యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో జనవరి 4 నుంచి సిడ్నీ వేదికగా ప్రారంభం కానున్న ఐదో టెస్టు మ్యాచే తన కెరీర్‌లో చివరిది అని తెలిపారు.
తన రిటైర్‌మెంట్ గురించి మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి గురి అయ్యాడు. అదే సమయంలో తాను ఎదుర్కొన్న జాతి వివక్ష గురించి వెల్లడించాడు. ఆస్ట్రేలియా తరపున టెస్ట్ క్రికెట్ ఆడిన తొలి ముస్లిం క్రికెటర్ తానే అని తెలిపాడు. తన లాంటి వాళ్లు ఆస్ట్రేలియా తరుపున క్రికెట్ ఆడలేరని చాలా మంది వెనక్కి లాగారన్నాడు. అయినప్పటికి కూడా తాను సాధించానని గుర్తు చేసుకున్నాడు.
Sara Tendulkar : నడి రోడ్డుపై బీర్‌బాటిల్‌తో సచిన్ కూతురు సారా టెండూల్కర్..! వీడియో వైరల్..
ఇందుకు చాలా గర్వంగా ఉన్నట్లు తెలిపాడు. ‘ఎంతో సంతోషంగా ఉన్నాను. అయితే.. జట్టులోని పలువురు ఆటగాళ్లు, మీడియా నా పట్ల వివక్షపూరితంగా వ్యవహరించారు. క్రికెట్‌పై తనకు ఉన్న నిబద్ధతను, అంకితభావాన్ని ప్రశ్నించారు.’ అని ఖావాజా తెలిపాడు.
మిగిలిన ఆటగాళ్లు గాయపడినే..
క్రికెటర్లకు గాయాలు సహజం. అయితే.. మిగిలిన వారితో పోలిస్తే తాను గాయపడినప్పుడు మాత్రం అదో తప్పుగా చూసేవారని అన్నాడు. మొత్తం తప్పు తనదే అన్నట్లుగా విమర్శించేవారిని తెలిపాడు. ఉదాహరణకు మ్యాచ్‌కు ముందు రాత్రి కొందరు ఆటగాళ్లు తప్ప తాగి గాయపడితే వారిని ఎవ్వరూ కూడా ఒక్క మాట అనేవారు కాదన్నాడు. అయితే.. తన విషయంలో మాత్రం పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉండేదన్నారు. ఈ విషయంలో తాను ఎక్కువగా బాధపడినట్లుగా చెప్పాడు.
Team India : 2026లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు ఎన్ని వన్డేల్లో ఆడే అవకాశం ఉందో తెలుసా?
“Thank you for letting me live my dream, and for sharing it with me.”
Lovely, emotional words from Usman Khawaja, as he announced he will retire from international cricket after the Sydney Test.
Read more: https://t.co/xEXcXAZMcq
Catch every ball this summer. Live and ad-free… pic.twitter.com/0WVWQwJR8w
— ABC SPORT (@abcsport) January 2, 2026
తన క్రికెట్ ప్రయాణంలో భార్య రేచల్, మిగిలిన కుటుంబ సభ్యులు, సహచర ఆటగాళ్లు, కోచ్‌లు మద్దతుగా నిలిచారని వారి అందరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ 39 ఏళ్ల ఖవాజా కన్నీటి పర్యంతమయ్యాడు.
మొదలైన చోటే..
2011లో ఉస్మాన్ ఖావాజా అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగ్రేటం చేశాడు. ఇంగ్లాండ్‌తో సిడ్నీ వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్‌తోనే ఖవాజా అరంగ్రేటం చేశాడు. ఆసీస్ తరుపున ఈ ఎడమ చేతి వాటం ఆటగాడు 87 టెస్టులు, 40 వన్డేలు, 9 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. టెస్టుల్లో 6206 పరుగులు చేశాడు. ఇందులో 16 శతకాలు ఉన్నాయి. ఇక వన్డేల్లో 1554, టీ20ల్లో 221 పరుగులు చేశాడు.