UPT20 League 2025 : ఆదివారం నుంచే యూపీటీ20 లీగ్‌.. షెడ్యూల్ ఇదే.. కెప్టెన్లుగా రింకూసింగ్‌, ధ్రువ్ జురెల్..

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ టీ20 ప్రీమియ‌ర్ లీగ్ (UPT20 League 2025) ఆగ‌స్టు 17 నుంచి లీగ్ ప్రారంభం కానుంది. సురేష్ రైనా ఈ లీగ్..

Uttar Pradesh T20 League 2025 starts from august 17th

UPT20 League 2025 : క్రికెట్ ప్రేమికుల‌ను అల‌రించేందుకు మ‌రో ప్రీమియ‌ర్ లీగ్ సిద్ధ‌మ‌వుతోంది. ఓ వైపు ఢిల్లీ ప్రీమియ‌ర్ లీగ్ (డీపీఎల్‌) రెండో సీజ‌న్ న‌డుస్తుండ‌గానే ఇప్పుడు ఉత్త‌ర‌ప్ర‌దేశ్ టీ20 ప్రీమియ‌ర్ లీగ్ (UPT20 League 2025) లీగ్ ప్రారంభం కానుంది.

ఆగ‌స్టు 17 (ఆదివారం) నుంచి యూపీటీ20 మూడో సీజ‌న్ ఆరంభం కానుంది. ఆరు జ‌ట్లు క‌ప్పు కోసం పోటీప‌డ‌నున్నారు. టీమ్ఇండియా మాజీ ఆట‌గాడు సురేష్ రైనా ఈ లీగ్ బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా ఉన్నారు.

రాండ్‌-రాబిన్, నాకౌట్ ఫార్మాట్‌లో..

ఆగ‌స్టు 17 నుంచి సెప్టెంబ‌ర్ 6 వ‌ర‌కు జ‌ర‌గ‌నున్న ఈ టోర్నీలో క‌ప్పు కోసం 6 జ‌ట్లు పోటీప‌డ‌నున్నాయి. రాండ్‌-రాబిన్, నాకౌట్ ఫార్మాట్‌లో టోర్నీని నిర్వ‌హించ‌నున్నారు. అంటే ఆరు జ‌ట్లు లీగ్ ద‌శ‌లో ఒక్క‌దానితో రెండు సార్లు ఢి కొట్ట‌నున్నాయి. పాయింట్ల ప‌ట్టిక‌లో తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జ‌ట్లు సెమీస్‌కు చేరుకుంటాయి. ఫైన‌ల్ మ్యాచ్ ల‌క్నోలోని ఎకానా స్టేడియంలో జ‌ర‌గ‌నుంది.

Bob Simpson : ఆస్ట్రేలియా క్రికెట్‌లో విషాదం.. మాజీ కెప్టెన్, కోచ్ బాబ్ సింప్స‌న్ క‌న్నుమూత‌..

ఇక ఒక్కొ జ‌ట్టులో అనుభవజ్ఞులైన దేశీయ ఆటగాళ్లు, యువ ఆట‌గాళ్లు క‌లిపి 18 మంది ఉంటారు. గోరఖ్‌పూర్ లయన్స్‌కు ధ్రువ్ జురెల్‌, మీరట్ మావెరిక్స్ కు రింకూసింగ్‌, లక్నో ఫాల్కన్స్ కు ప్రియ‌ర్ గార్గ్‌, కాశీ రుద్రాస్‌కు క‌ర‌ణ్ శ‌ర్మ‌, కాన్పూర్ సూపర్ స్టార్స్ స‌మీర్ రిజ్వీ లు కెప్టెన్లుగా ఉన్నారు. నోయిడా కింగ్స్ జ‌ట్టు ఇంకా త‌మ కెప్టెన్‌ను ప్ర‌క‌టించ‌లేదు. మ‌హ్మ‌ద్ అమాన్ కెప్టెన్‌గా ఎంపిక అయ్యే అవ‌కాశాలు ఉన్నాయి.

యూపీటీ20 లీగ్ 2025 షెడ్యూల్‌..

* ఆగస్టు 17 – మీరట్ మావెరిక్స్ vs కాన్పూర్ సూపర్ స్టార్స్
* ఆగస్టు 18 – కాశీ రుద్రాస్ vs గౌర్ గోరఖ్‌పూర్ లయన్స్
* ఆగస్టు 18 – నోయిడా కింగ్స్ vs లక్నో ఫాల్కన్స్
* ఆగస్టు 19 – కాన్పూర్ సూపర్ స్టార్స్ vs కాశీ రుద్రాస్
* ఆగస్టు 19 – మీరట్ మావెరిక్స్ vs లక్నో ఫాల్కన్స్
* ఆగస్టు 20 – నోయిడా కింగ్స్ vs గౌర్ గోరఖ్‌పూర్ లయన్స్
* ఆగస్టు 20 – లక్నో ఫాల్కన్స్ vs కాన్పూర్ సూపర్ స్టార్స్
* ఆగస్టు 21 – నోయిడా కింగ్స్ vs కాశీ రుద్రాస్
* ఆగస్టు 21 – మీరట్ మావెరిక్స్ vs గౌర్ గోరఖ్‌పూర్ లయన్స్

KKR : రాజ‌స్థాన్‌కు బంఫ‌ర్ ఆఫ‌ర్ ఇచ్చిన కేకేఆర్‌..! సంజూని ఇస్తే.. ఇద్ద‌రు ఆట‌గాళ్ల‌తో పాటు..

* ఆగస్టు 22 – నోయిడా కింగ్స్ vs కాన్పూర్ సూపర్‌స్టార్ట్స్
* ఆగస్టు 22 – లక్నో ఫాల్కన్స్ vs గౌర్ గోరఖ్‌పూర్ లయన్స్
* ఆగస్టు 23 – కాశీ రుద్రాస్ vs మీరట్ మావెరిక్స్
* ఆగస్టు 23 – గౌర్‌ గోరఖ్‌పూర్ లయన్స్ vs కాన్పూర్ సూపర్‌స్టార్స్
* ఆగస్టు 24 – మీరట్ మావెరిక్స్ vs నోయిడా కింగ్స్
* ఆగస్టు 24 – కాశీ రుద్రాస్ vs లక్నో ఫాల్కన్స్
* ఆగస్టు 25 – కాన్పూర్ సూపర్‌స్టార్స్ vs మీరట్ మావెరిక్స్
* ఆగస్టు 25 – కాశీ రుద్రాస్ vs గౌర్ గోరఖ్‌పూర్ లయన్స్
* ఆగస్టు 26 – లక్నో ఫాల్కన్స్ vs నోయిడా కింగ్స్
* ఆగస్టు 26 – కాన్పూర్ సూపర్‌స్టార్స్ vs కాశీ రుద్రాస్
* ఆగస్టు 27 – లక్నో ఫాల్కన్స్ vs మీరట్ మావెరిక్స్
* ఆగస్టు 27 – గౌర్ గోరఖ్‌పూర్ లయన్స్ vs నోయిడా కింగ్స్
* ఆగస్టు 28 – కాన్పూర్ సూపర్‌స్టార్స్ vs లక్నో ఫాల్కన్స్
* ఆగస్టు 28 – నోయిడా కింగ్స్ vs కాశీ రుద్రాస్
* ఆగస్టు 29 – గౌర్ గోరఖ్‌పూర్ లయన్స్ vs మీరట్ మావెరిక్స్
* ఆగస్టు 29 – కాన్పూర్ సూపర్‌స్టార్స్ vs నోయిడా కింగ్స్
* ఆగస్టు 30 – గౌర్ గోరఖ్‌పూర్ లయన్స్ vs లక్నో ఫాల్కన్స్
* ఆగస్టు 30 – కాశీ రుద్రాస్ vs మీరట్ మావెరిక్స్
* ఆగస్టు 31 – గౌర్ గోరఖ్‌పూర్ లయన్స్ vs కాన్పూర్ సూపర్‌స్టార్ట్స్
* ఆగస్టు 31 – మీరట్ మావెరిక్స్ vs నోయిడా కింగ్స్
* సెప్టెంబర్ 1 – లక్నో ఫాల్కన్స్ vs కాశీ రుద్రాస్
* సెప్టెంబర్ 3 – క్వాలిఫైయర్ 1
* సెప్టెంబర్ 3 – ఎలిమినేటర్
* సెప్టెంబర్ 4 – క్వాలిఫైయర్ 2
* సెప్టెంబర్ 6 – ఫైనల్