Vaibhav Sooryavanshi : న‌క్కతోక తొక్కిన వైభ‌వ్ సూర్య‌వంశీ.. వైస్ కెప్టెన్‌గా బాధ్య‌త‌లు..

జింబాబ్వే ప‌ర్య‌ట‌న‌లో అద‌ర‌గొట్టి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును అందుకున్న టీమ్ఇండియా యువ సంచ‌ల‌నం, 15 ఏళ్ల వైభ‌వ్ సూర్య‌వంశీకి (Vaibhav Sooryavanshi ) కీల‌క బాధ్య‌త ద‌క్కింది.

Vaibhav Sooryavanshi named vice captain of East Zone for the 2026 Duleep Trophy

Vaibhav Sooryavanshi : జింబాబ్వే ప‌ర్య‌ట‌న‌లో అద‌ర‌గొట్టి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును అందుకున్న టీమ్ఇండియా యువ సంచ‌ల‌నం, 15 ఏళ్ల వైభ‌వ్ సూర్య‌వంశీకి కీల‌క బాధ్య‌త ద‌క్కింది. దులీప్ ట్రోఫీ 2026 కోసం ప్రకటించిన ఈస్ట్ జోన్ జట్టుకు అత‌డు వైస్ కెప్టెన్‌గా ఎంపిక అయ్యాడు. ఈ జ‌ట్టుకు టీమ్ఇండియా వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ ఇషాన్ కిష‌న్ కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నాడు.

మహ్మద్ షమీ, ముఖేష్ కుమార్, అభిమన్యు ఈశ్వరన్, షాహ్‌బాజ్ అహ్మద్ వంటి సీనియర్ ఆటగాళ్లు కూడా ఈస్ట్ జోన్ జ‌ట్టులో చోటు ద‌క్కించుకున్నారు. సీనియ‌ర్ ఆట‌గాళ్లు ఉన్న‌ప్ప‌టికి కూడా యువ ఆటగాడైన వైభవ్ సూర్యవంశీకి ఇంత చిన్న వయసులోనే వైస్ కెప్టెన్ బాధ్యతలు అప్పగించడం అతని ప్రతిభకు నిదర్శనంగా భావిస్తున్నారు.

ఈస్ట్ జోన్ బ్యాటింగ్ విభాగంలో అభిమన్యు ఈశ్వరన్, సుదీప్ కుమార్ ఘరామి, విరాట్ సింగ్, సూరజ్ సింధు జైస్వాల్, సుభ్రాంశు సేనాపతి, దేనిష్ దాస్, శిఖర్ మోహన్ వంటి ఆటగాళ్లు ఉన్నారు. కుమార్ కుషాగ్రా మరో వికెట్‌కీపర్ ఎంపికగా జట్టులో చోటు సంపాదించాడు.

Clicky Ponting : ఇదేం స్కామ్‌రా అయ్యా.. అంపైర్‌నే మాయ చేశావుగా.. చిటిక వేసి ఔట్‌.. వీడియో వైర‌ల్‌..

బౌలింగ్ విభాగంలో మహ్మద్ షమీ తన అపార అనుభవంతో జట్టుకు బలం కానున్నాడు. అతనికి ముఖేష్ కుమార్, అభిజిత్ సర్కార్ సహకరించనుండగా, షాహ్‌బాజ్ అహ్మద్, అనుకుల్ రాయ్ ఆల్‌రౌండర్లుగా కీలక పాత్ర పోషించే అవకాశముంది.

ఈస్ట్ జోన్ జట్టు ఇదే..
ఇషాన్ కిషన్ (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ (వైస్ కెప్టెన్), అభిమన్యు ఈశ్వరన్, సుదీప్ కుమార్ ఘరామి, షాహ్‌బాజ్ అహ్మద్, సూరజ్ సింధు జైస్వాల్, మహ్మద్ షమీ, ముఖేష్ కుమార్, కుమార్ కుషాగ్రా, శిఖర్ మోహన్, అనుకుల్ రాయ్, విరాట్ సింగ్, సుభ్రాంశు సేనాపతి, దేనిష్ దాస్, అభిజిత్ సర్కార్.

స్టాండ్‌బై ఆటగాళ్లు: ఆయుష్ లోహరూకా, శ్రీదామ్ పాల్, సంబిత్ ఎస్. బరాల్, శరణ్‌దీప్ సింగ్, స్వస్తిక్ సమాల్.

దులీప్ ట్రోఫీ 2026 ఆగ‌స్టు 23 నుంచి సెప్టెంబ‌ర్ 10 వ‌ర‌కు జ‌ర‌గ‌నుంది. ఆగ‌స్టు 15 నుంచి 27 వ‌ర‌కు భార‌త జ‌ట్టు శ్రీలంక‌తో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడ‌నున్న సంగ‌తి తెలిసిందే. అయితే.. టెస్టు జ‌ట్టులో ఇషాన్ కిష‌న్‌, వైభ‌వ్ సూర్య‌వంశీల‌కు స్థానం ల‌భించ‌ని సంగ‌తి తెలిసిందే.