Vaibhav Suryavanshi Becomes First Player In The World To Achieve This feat in Youth ODI series
ఐపీఎల్‌లో రికార్డు శతకంతో క్రికెట్ ప్రపంచాన్ని తనవైపుకు చూసేలా చేశాడు 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ. అతడి మెరుపులు ఐపీఎల్‌కే పరిమితం కాలేదు. ఇటీవల ముగిసిన యూత్ వన్డే క్రికెట్‌లోనూ తనదైన శైలిలో విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడాడు.
భారత అండర్-19 జట్టు తరుపున ఇంగ్లాండ్ అండర్-19 జట్టుతో జరిగిన 5 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో చెలరేగి ఆడాడు. 71 సగటు 174.01 స్ట్రైక్‌రేటుతో 355 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, ఒక అర్థశతకం ఉంది.
MLC 2025 : మాక్స్‌వెల్‌కి వరుణ సాయం.. మేజర్ లీగ్ క్రికెట్‌లో ఫైనల్‌కు వాషింగ్టన్..
ఈ క్రమంలో వైభవ్ సూర్యవంశీ ఓ అరుదైన ఘనతను సాధించాడు. ద్వైపాక్షిక్ష యూత్ వన్డే సిరీస్‌లో 150 కంటే ఎక్కువ స్ట్రైక్‌రేటుతో 300 కంటే ఎక్కువ పరుగులు చేసిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. గతంలో ఈ రికార్డు బంగ్లాదేశ్ ఆటగాడు తోహిద్ హ్రాయిడీ పేరిట ఉంది. అతడు 2019లో శ్రీలంకతో జరిగిన నాలుగు ఇన్నింగ్స్‌ల్లో 114.62 స్ట్రైక్‌రేటుతో 431 పరుగులు చేశాడు.
యూత్ వన్డే సిరీస్‌లో కనీసం 200 పరుగులు సాధించిన ఆటగాళ్లలో అత్యుత్తమ స్ట్రైక్‌రేట్ వీరిదే..
వైభవ్ సూర్యవంశీ – 5 మ్యాచ్‌ల్లో 174.01 స్ట్రైక్‌రేటుతో 355 పరుగులు – 2025లో ఇంగ్లాండ్ పై
ఇమ్రాన్ నజీర్ – 3 మ్యాచ్‌ల్లో 159.45 స్ట్రైక్‌రేటుతో 256 పరుగులు – 1999లో దక్షిణాఫ్రిపై
టీహెచ్ఎస్ ఆర్ఈడబ్ల్యూ – 5 మ్యాచ్‌ల్లో 142.13 స్ట్రైక్‌రేటుతో 280 పరుగులు – 2025లో ఇంగ్లాండ్ పై
పులిందు పెరెరా – 3 మ్యాచ్‌ల్లో 139.76 స్ట్రైక్‌రేటుతో 239 పరుగులు – 2023లో పాకిస్తాన్ పై
సలీం ఎలాషీ – 3 మ్యాచ్‌ల్లో 124.84 స్ట్రైక్‌రేటుతో 201 పరుగులు – 1995లో న్యూజిలాండ్ పై
ఇక్కడ నమ్మశక్యం కాని విషయం ఏమిటంటే.. ఓ సిరీస్‌లో సూర్యవంశీ కంటే మెరుగైన స్ట్రైక్ రేట్ ఉన్న ఆటగాడు ఐర్లాండ్‌కు చెందిన స్కాట్ మాక్‌బర్త్. అతను 2023లో ఇంగ్లాండ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల్లో 150 స్ట్రైక్‌రేటుతో 91 పరుగులు మాత్రమే చేశాడు. ఇటీవల ముగిసిన సిరీస్‌లో 100 కంటే ఎక్కువ పరుగులు చేసిన ఏ ఆటగాడు సూర్యవంశీ స్ట్రైక్ రేట్‌ను అధిగమించలేకపోయాడు