MLC 2025 : మాక్స్‌వెల్‌కి వ‌రుణ సాయం.. మేజ‌ర్ లీగ్ క్రికెట్‌లో ఫైన‌ల్‌కు వాషింగ్ట‌న్‌..

మేజ‌ర్ లీగ్ క్రికెట్ 2025 సీజ‌న్‌లో ఫైన‌ల్‌కు చేరుకున్న తొలి జ‌ట్టుగా వాషింగ్ట‌న్ ఫ్రీడమ్ నిలిచింది.

MLC 2025 : మాక్స్‌వెల్‌కి వ‌రుణ సాయం.. మేజ‌ర్ లీగ్ క్రికెట్‌లో ఫైన‌ల్‌కు వాషింగ్ట‌న్‌..

Washington Freedom enter into MLC 2025 final

Updated On : July 9, 2025 / 9:50 AM IST

మేజ‌ర్ లీగ్ క్రికెట్ 2025 సీజ‌న్‌లో ఫైన‌ల్‌కు చేరుకున్న తొలి జ‌ట్టుగా వాషింగ్ట‌న్ ఫ్రీడమ్ నిలిచింది. మాక్స్‌వెల్ సార‌థ్యంలోని వాషింగ్ట‌న్‌కు కాస్త అదృష్టం కలిసి వ‌చ్చింద‌నే చెప్పాలి. భార‌త‌కాల‌మానం ప్ర‌కారం బుధ‌వారం తెల్ల‌వారుజామున టెక్సాస్ సూప‌ర్ కింగ్స్‌తో జ‌ర‌గాల్సిన మ్యాచ్ వ‌ర్షం కార‌ణంగా ర‌ద్దు అయింది.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన వాషింగ్ట‌న్ జ‌ట్టు బౌలింగ్ ఎంచుకుంది. అయితే.. ఆట‌గాళ్లు మైదానంలోకి అడుగుపెట్టే స‌మ‌యంలో వ‌ర్షం మొద‌లైంది. ఎంత‌సేప‌టికి వ‌ర్షం త‌గ్గ‌క‌పోవ‌డంతో మ్యాచ్‌ను ర‌ద్దు చేశారు. నిబంధ‌న‌ల ప్ర‌కారం పాయింట్ల ప‌ట్టిక‌లో అగ్ర‌స్థానంలో ఉన్న వాషింగ్ట‌న్ ఫ్రీడ‌మ్ జ‌ట్టు ఫైన‌ల్‌కు చేరుకుంది.

ENG vs IND : లార్డ్స్‌లో 45 నిమిషాల పాటు జ‌స్‌ప్రీత్ బుమ్రా.. ఇంగ్లాండ్‌కు చుక్క‌లే..

దీంతో ఫాఫ్‌ డుప్లెసిస్‌ నేతృత్వంలోని టెక్సాస్ సూప‌ర్ కింగ్స్ కు కాస్త నిరాశ త‌ప్ప‌లేదు. అయితే.. టెక్సాస్ జ‌ట్టుకు ఫైన‌ల్ చేరుకునేందుకు మ‌రో అవ‌కాశం ఉంది. గురువారం తెల్ల‌వారుజామున శాన్ ఫ్రాన్సిస్కో-ఎంఐ న్యూయార్క్ జ‌ట్ల మ‌ధ్య ఎలిమినేట‌ర్ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జ‌ట్టుతో జూలై 12న టెక్సాస్ జ‌ట్టు త‌ల‌ప‌డ‌నుంది. ఈ మ్యాచ్‌లో విజ‌యం సాధించిన జ‌ట్టు ఫైన‌ల్‌కు చేరుకుంటుంది.