Vaibhav Suryavanshi becoming the youngest player to take a wicket in a Youth Test match
టీమ్ఇండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఇంగ్లాండ్ గడ్డ పై అదరగొడుతున్నాడు. ఇటీవల జరిగిన యూత్ వన్డే సిరీస్‌లో విధ్వంసకర బ్యాటింగ్‌లో చేలరేగిన అతడు తాజాగా అరుదైన ఘనత సాధించాడు. ఇంగ్లాండ్ అండర్-19 జట్టుతో జరిగిన తొలి యూత్ టెస్టులో ఆల్‌రౌండ్ ప్రదర్శన చేశాడు. బ్యాటింగ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 14 పరుగులు మాత్రమే చేసిన వైభవ్ రెండో ఇన్నింగ్స్‌లో 56 పరుగులతో రాణించాడు.
ఇక ఈ మ్యాచ్‌లో బంతితో చరిత్ర సృష్టించాడు. లెఫ్టార్మ్ స్పిన్నర్ అయిన వైభవ్ ఈ మ్యాచ్‌లో రెండు వికెట్లు తీశాడు. ఇంగ్లాండ్ కెప్టెన్ హంజా షేక్ (84)తో పాటు థామస్ రెవ్ (34)లను పెవిలియన్‌కు చేర్చాడు. ఈ క్రమంలో భారత అండర్ 19 టెస్టు క్రికెట్‌లో అత్యంత పిన్న వయసులో (14 సంవత్సరాల 107 రోజులు) వికెట్ తీసిన ప్లేయర్‌గా వైభవ్ చరిత్ర సృష్టించాడు.
At 14 years and 107 days, Vaibhav Suryavanshi becomes the youngest Indian to take a wicket in a Youth Test match. 🧒🔥 pic.twitter.com/JjyLzDvt57
— Sports Culture (@SportsCulture24) July 15, 2025
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. కెప్టెన్ ఆయుష్ మాత్రే (102) శతకంతో చెలరేగడంతో తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 540 పరుగులు చేసింది. అనంతరం ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 439 పరుగులు చేసింది. దీంతో భారత్‌కు 101 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది.
ఆ తరువాత రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 248 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకుని ఇంగ్లాండ్ ముందు 350 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. అయితే.. ఐదో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 7 వికెట్లు కోల్పోయి 270 పరుగులు చేసింది. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది.