ENG vs IND : భారత్‌తో నాలుగో టెస్టు.. జట్టులో భారీ మార్పు చేసిన ఇంగ్లాండ్.. ఏకంగా 8 ఏళ్ల తరువాత..
భారత్‌తో నాలుగో టెస్టు మ్యాచ్‌కు 14 మందితో కూడిన జట్టును ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ప్రకటించింది.

England Make Change For 4th Test against India Replaces Shoaib Bashir With Dawson
అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ జరుగుతోంది. లార్డ్స్‌లో విజయంతో ఈ సిరీస్‌లో ఇంగ్లాండ్ 2-1 ఆధిక్యంలోకి వెళ్లింది. ఇక ఇరు జట్ల మధ్య మాంచెస్టర్ వేదికగా జూలై 23 నుంచి 27 వరకు నాలుగో టెస్టు మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు 14 మందితో కూడిన జట్టును ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ప్రకటించింది.
మూడో టెస్టు మ్యాచ్‌లో గాయపడ్డ స్టార్ స్పిన్నర్ షోయబ్ బషీర్ ఈ సిరీస్‌లోని మిగిలిన మ్యాచ్‌లకు దూరం అయిన సంగతి తెలిసిందే. అతడి స్థానంలో ఎడమచేతి వాటం స్పిన్నర్ లియామ్ డాసన్‌ను ఎంపిక చేసింది. మిగిలిన టీమ్‌లో ఎలాంటి మార్పులు లేవు. కాగా.. డాసన్ ఎనిమిదేళ్ల తరువాత టెస్టు జట్టులో చోటు దక్కించుకోవడం గమనార్హం.
Shubman Gill : చివరి బ్యాటర్ ఔట్ అయినప్పుడు ఏమనిపించింది.. గిల్‌కు బ్రిటన్ రాజు ప్రశ్న..
Welcome, Daws! 👋
Spinner Liam Dawson joins our squad for the Fourth Test match against India 🏏
Full story 👇
— England Cricket (@englandcricket) July 15, 2025
డాసన్ చివరి సారిగా 2017లో దక్షిణాఫ్రికాపై ఆడాడు. తన కెరీర్‌లో ఇంగ్లాండ్ తరుపున మూడు టెస్టులు ఆడిన డాసన్ ఏడు వికెట్లు మాత్రమే తీశాడు. ప్రస్తుతం డొమాస్టిక్ క్రికెట్‌లో అద్భుతంగా రాణిస్తున్నాడు. ఈ క్రమంలోనే అతడికి సెలక్టర్ల నుంచి పిలుపు వచ్చింది. మూడు టెస్టులో విఫలమైనప్పటికి ఓపెనర్ జాక్ క్రాలీకి సెలక్టర్లు మరో అవకాశమిచ్చారు.
నాలుగో టెస్టుకు ఇంగ్లాండ్ జట్టు ఇదే..
బెన్ స్టోక్స్ (కెప్టెన్), జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, జాకబ్ బెథెల్, హ్యారీ బ్రూక్, బ్రైడాన్ కార్స్, జాక్ క్రాలే, లియామ్ డాసన్, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, జేమీ స్మిత్, జోష్ టంగ్, క్రిస్ వోక్స్.