Womens odi World Cup 2025 : మహిళల వన్డే ప్రపంచకప్ 2025 వార్మప్ మ్యాచ్‌ల వివరాలు ఇవే.. టీమ్ఇండియా ఎన్ని ఆడనుందంటే..?
మహిళల వన్డే ప్రపంచకప్ 2025 సెప్టెంబర్ 30 నుంచి నవంబర్ 2 వరకు జరగనుంది.

ICC Womens Cricket World Cup 2025 Warm up schedule out
మహిళల వన్డే ప్రపంచకప్ 2025 సెప్టెంబర్ 30 నుంచి నవంబర్ 2 వరకు జరగనుంది. ఈ మెగాటోర్నీకి భారత్, శ్రీలంక దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఇప్పటికే ఈ మెగాటోర్నీకి సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. ఇక తాజాగా ఈ టోర్నీకి సంబంధించి వార్మప్ మ్యాచ్‌ల షెడ్యూల్‌ను ఐసీసీ విడుదల చేసింది. భారత జట్టు రెండు వార్మప్ మ్యాచ్‌లను (ఇంగ్లాండ్, న్యూజిలాండ్) ఆడనుంది.
ప్రపంచకప్‌కు అర్హత సాధించిన అన్ని జట్లు కూడా వార్మప్ మ్యాచ్‌లు ఆడనున్నాయి. ఒక్క ఆస్ట్రేలియా మహిళల జట్టు తప్ప మిగిలిన అన్ని కూడా రెండు వార్మప్ మ్యాచ్‌లు ఆడనున్నాయి. నాలుగు వేదికల్లో సెప్టెంబర్ 25 నుంచి 28 మధ్య వార్మప్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ వార్మప్ మ్యాచ్‌ల్లో భారత్-ఏ, శ్రీలంక-ఏ జట్లు కూడా పాల్గొననున్నాయి. శ్రీలంక-ఏ జట్టు రెండు, భారత-ఏ జట్టు ఓ మ్యాచ్ ఆడనుంది.
భారత వార్మప్ మ్యాచ్‌లు ఇవే..
బెంగళూరు వేదికగా సెప్టెంబర్ 25న భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య తొలి వార్మప్ మ్యాచ్ జరగనుంది. ఇక భారత్ రెండో వార్మప్ మ్యాచ్ కూడా బెంగళూరులోనే ఉంది. సెప్టెంబర్ 27న న్యూజిలాండ్‌తో ఆడనుంది. మధ్యాహ్నం వార్మప్ మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి.
వార్మప్ మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదే..
* సెప్టెంబర్ 25న ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ – BCCI సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ 1 గ్రౌండ్ బెంగళూరు (మధ్యాహ్నం 3 గంటలకు)
* సెప్టెంబర్ 25న దక్షిణాఫ్రికా వర్సెస్ న్యూజిలాండ్ – చిన్నస్వామి బెంగళూరు (మధ్యాహ్నం 3 గంటలకు)
* సెప్టెంబర్ 25న శ్రీలంక వర్సెస్ పాకిస్థాన్ – కొలంబో క్రికెట్ క్లబ్ (మధ్యాహ్నం 3 గంటలకు)
* సెప్టెంబర్ 25న బంగ్లాదేశ్ వర్సెస్ శ్రీలంక ‘ఎ’- ఆర్.ప్రేమదాస కొలంబో(మధ్యాహ్నం 3 గంటలకు)
Shubman Gill : చివరి బ్యాటర్ ఔట్ అయినప్పుడు ఏమనిపించింది.. గిల్‌కు బ్రిటన్ రాజు ప్రశ్న..
* సెప్టెంబర్ 27న ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లాండ్- BCCI సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ 1 గ్రౌండ్ బెంగళూరు (మధ్యాహ్నం 3 గంటలకు)
* సెప్టెంబర్ 27న భారత్ వర్సెస్ న్యూజిలాండ్ – చిన్నస్వామి బెంగళూరు (మధ్యాహ్నం 3 గంటలకు)
* సెప్టెంబర్ 27న శ్రీలంక వర్సెస్ బంగ్లాదేశ్ – కొలంబో క్రికెట్ క్లబ్ కొలంబో(మధ్యాహ్నం 3 గంటలకు)
* సెప్టెంబర్ 28న దక్షిణాఫ్రికా వర్సెస్ ఇండియా ఎ – BCCI సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ 1 గ్రౌండ్ (మధ్యాహ్నం 3 గంటలకు)
* సెప్టెంబర్ 28న పాకిస్తాన్ వర్సెస్ శ్రీలంక ‘ఎ’- కొలంబో క్రికెట్ క్లబ్, కొలంబో -(మధ్యాహ్నం 3 గంటలకు)