Site icon 10TV Telugu

Harbhajan slapping Sreesanth : శ్రీశాంత్‌ను చెంప‌దెబ్బ కొట్టిన హ‌ర్భ‌జ‌న్‌.. 18 ఏళ్ల త‌రువాత వీడియో రిలీజ్‌..

Video of Harbhajan slapping Sreesanth releases after 18 years

Video of Harbhajan slapping Sreesanth releases after 18 years

Harbhajan slapping Sreesanth : ఐపీఎల్ 2008లో ప్రారంభ‌మైంది. ప్ర‌పంచంలోనే అత్యంత విజ‌య‌వంత‌మైన లీగ్‌లో ఒక‌టిగా నిలిచింది. అయితే.. ఐపీఎల్ ఆరంభ సీజ‌న్‌లో జ‌రిగిన ఓ ఘ‌ట‌న‌ను క్రికెట్ ప్రేమికులు ఎన్న‌టికి మ‌రిచిపోలేరు. శ్రీకాంత్‌ను హ‌ర్భ‌జ‌న్ సింగ్ చెంప‌దెబ్బ కొట్ట‌డం(Harbhajan slapping Sreesanth). ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో ఇన్నాళ్లు బ‌య‌ట‌కు రాలేదు. అయితే.. తాజాగా దీన్ని ఐపీఎల్ మాజీ ఛైర్మ‌న్ ల‌లిత్ మోదీ విడుదల చేశారు.

బియాండ్23 క్రికెట్ పాడ్‌కాస్ట్‌లో ఆస్ట్రేలియా ప్రపంచ కప్ విజేత కెప్టెన్ మైఖేల్ క్లార్క్‌తో ఇచ్చిన ఇంటర్వ్యూలో లలిత్ మోడీ చూపించాడు.

Rohit Sharma : రోహిత్ శ‌ర్మ‌కు ఎవ‌రి బౌలింగ్‌లో సిక్స‌ర్లు కొట్ట‌డం అంటే ఇష్ట‌మో తెలుసా?

“ఆట ముగిసింది. కెమెరాలు ఆపివేయబడ్డాయి. నా భద్రతా కెమెరాలలో ఒకటి ఆన్‌లో ఉంది. అది శ్రీశాంత్, భజ్జీ (హర్భజన్) మధ్య జరిగిన సంఘటనను చిత్రీకరించింది. భజ్జీ అతనికి బ్యాక్-హ్యాండర్ ఇచ్చాడు. ఇదిగో వీడియో,” అని మోడీ వాస్తవ సంఘటన యొక్క ఫుటేజ్‌ను చూపించే ముందు అన్నాడు.

2008 సీజ‌న్‌లో హ‌ర్భ‌జ‌న్ సింగ్ ముంబై ఇండియ‌న్స్‌కు ప్రాతినిధ్యం వ‌హించ‌గా, శ్రీశాంత్ కింగ్స్ ఎలెవ‌న్ పంజాబ్‌కు ఆడాడు. మ్యాచ్ ముగిసిన త‌రువాత ఇరు జ‌ట్ల ఆట‌గాళ్లు ఒకరికొక‌రు షేక్ హ్యాండ్స్ ఇచ్చుకునే క్ర‌మంలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది.

PV Sindhu : BWF ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో అద‌ర‌గొడుతున్న పీవీ సింధు.. వ‌ర‌ల్డ్ నంబ‌ర్ 2 పై విజ‌యం

కాగా.. ఈ ఘ‌ట‌ను సంబంధించి ఇప్ప‌టికే ప‌లుమార్లు హ‌ర్భ‌జ‌న్ సింగ్ పశ్చాత్తాపం వ్య‌క్తం చేశాడు. ఆ సంఘ‌ట‌న‌ను త‌న కెరీర్ నుంచి తొల‌గించాల‌ని అనుకుంటున్న‌ట్లు చెప్పాడు. తాను అలా చేసి ఉండాల్సింది కాద‌న్నాడు. ‘ఇప్ప‌టికే 200 సార్ల‌కు పైగా క్ష‌మాప‌ణ‌లు చెప్పాను. ఆ సంఘ‌ట‌న న‌న్ను చాలా బాధించింది. నాకు అవ‌కాశం ల‌భించిన ప్ర‌తిసారి నేను క్ష‌మాప‌ణ‌లు చెబుతూనే ఉన్నాను.’ అని హ‌ర్భ‌జ‌న్ సింగ్ ఇటీవ‌ల ర‌విచంద్ర‌న్ అశ్విన్‌తో జ‌రిగిన సంభాష‌లో అన్నాడు.

Exit mobile version