Vijay Hazare Trophy Himachal Pradesh vs Mumbai Shreyas Iyer 82 runs in 53 balls
Shreyas Iyer : గతేడాది అక్టోబర్‌లో ఆస్ట్రేలియా గడ్డపై ఆసీస్‌తో జరిగిన వన్డే సిరీస్ లో అలెక్స్ కేరీ క్యాచ్ అందుకునే క్రమంలో టీమ్ఇండియా వన్డే వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ గాయపడిన సంగతి తెలిసిందే. గాయం తీవ్రమైనది కావడంతో ఇన్నాళ్లు అతడు ఆటకు దూరం అయ్యాడు. ఇక ఇప్పుడు కోలుకోవడంతో విజయ్ హజారే ట్రోఫీలో బరిలోకి దిగాడు.
ముంబైకి ప్రాతినిధ్యం వహిస్తున్న అయ్యర్ హిమాచల్ ప్రదేశ్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో విజృంభించి ఆడాడు. తనదైన శైలిలో బౌండరీలు కొడుతూ కేవలం 36 బంతుల్లోనే అర్ధశతకాన్ని పూర్తి చేసుకున్నాడు.
Vijay Hazare Trophy : విజయ్ హజారేలో డబుల్ సెంచరీ..? ఎవరీ అమన్ రావ్? అమెరికాలో పుట్టి..
ఇక ఈ మ్యాచ్‌లో మొత్తంగా అయ్యర్ 53 బంతులను ఎదుర్కొన్నాడు. 10 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 82 పరుగులు చేశాడు. న్యూజిలాండ్‌తో జనవరి 11 నుంచి ప్రారంభం కానున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు ముందు అయ్యర్ ఫామ్ అందుకోవడంతో ఫ్యాన్స్ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఇక ముంబై, హిమాచల్ ప్రదేశ్ మ్యాచ్ విషయానికి వస్తే.. పొగమంచు కారణంగా మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమైంది. దీంతో మ్యాచ్‌ను 33 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 299 పరుగులు చేసింది.
Mustafizur Rahman : రూ.9.20 కోట్ల మొత్తంలో ముస్తాఫిజుర్ రెహమాన్‌కు ఎంత వస్తుందో తెలుసా?
ముంబై బ్యాటర్లలో ముషీర్ ఖాన్ (73; 51 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లు), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (82; 53 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్ సెంచరీలతో రాణించారు. యశస్వి జైస్వాల్ (15), సర్ఫరాజ్ ఖాన్ (21), సూర్యకుమార్ యాదవ్(24), శివమ్ దూబె (20) లు రాణించారు. హిమాచల్ ప్రదేశ్ బౌలర్లలో వైభవ్ అరోరా, అభిషేక్ కుమార్, కుశాల్ పాల్ లు తలా మూడు వికెట్లు తీశారు.