Vinesh Phogat : పండంటి మ‌గబిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన మాజీ రెజ్లింగ్ స్టార్, కాంగ్రెస్ ఎమ్మెల్యే వినేశ్ ఫోగ‌ట్‌..

మాజీ రెజ్లింగ్ స్టార్, కాంగ్రెస్ ఎమ్మెల్యే వినేశ్‌ ఫోగట్ మంగ‌ళ‌వారం ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆస్ప‌త్రిలో పండంటి మగ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది.

Vinesh Phogat gives birth to baby boy

మాజీ రెజ్లింగ్ స్టార్, కాంగ్రెస్ ఎమ్మెల్యే వినేశ్‌ ఫోగట్ మంగ‌ళ‌వారం ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆస్ప‌త్రిలో పండంటి మగ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. 30 ఏళ్ల వినేశ్‌, ఆమె భర్త రెజ్లర్ సోమ్‌వీర్ రథీ దంపతులకు ఇది మొదటి సంతానం. తల్లీబిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. వినేశ్‌ దంప‌తుల‌కు సోష‌ల్ మీడియా వేదిక‌గా ప‌లువురు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు.

వినేశ్‌ అన్నయ్య హర్విందర్ ఫోగట్ ఈ వార్తను ధృవీకరించారు. ‘వినేశ్‌ మంగ‌ళ‌వారం ఉదయం మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు. ఇది మా కుటుంబానికి ఎంతో ఆనందకరమైన క్షణం.’ అని హర్విందర్ ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో అన్నారు. త్వ‌ర‌లోనే వినేష్‌ను సోమ్‌వీర్‌ను ఇంటికి తీసుకువ‌స్తామ‌ని తెలిపాడు. ఆమెను, బాబును చూసేందుకు స్వ‌గ్రామ‌మైన బ‌లాలీలోని ప్ర‌తి ఒక్క‌రూ ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్న‌ట్లుగా చెప్పుకొచ్చారు.

ENG vs IND : ఇంగ్లాండ్‌తో రెండో టెస్టుకు ముందు కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్ కీల‌క వ్యాఖ్య‌లు..

మార్చిలో వినేష్ ప్రెగ్నెన్సీ ని సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌క‌ట‌న చేశారు. త‌మ ప్రేమ క‌థ‌ కొత్త అధ్యాయంతో కొన‌సాగుతుందంటూ భ‌ర్త సోమ్‌వీర్‌తో ఉన్న ఫోటోను వినేష్ షేర్ చేసింది.

గత ఏడాది పారిస్ ఒలింపిక్స్‌లో బ‌రువు నిబంధ‌న‌ల ఉల్లంఘించ‌డంతో 50 కేజీల విభాగం ఫైన‌ల్ నుంచి అన‌ర్హ‌త‌కు గురైంది వినేశ్‌. త‌న క్రీడా జీవితంలో అతి పెద్ద గాయం ఇదేన‌ని ఆమె చెప్పారు. ఈ ఘ‌ట‌న‌తో తీవ్ర నిరాశ‌కు గురైన ఆమె రెజ్లింగ్‌కు గుడ్‌బై చెప్పింది. ఆ త‌రువాత‌ రాజ‌కీయాల్లోకి వ‌చ్చింది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌లో చేరారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపికి చెందిన యోగేష్ కుమార్‌ను ఓడించి జులానా సీటును గెలుచుకున్నారు.