Vinesh Phogat : వినేశ్ ఫోగ‌ట్‌కు ర‌జ‌తం వ‌చ్చేనా..? సీఏఎస్ తీర్పు ఎలా ఉండ‌బోతుంది..?

పారిస్ ఒలింపిక్స్ 2024లో భార‌త స్టార్ రెజ్ల‌ర్ వినేశ్ ఫోగ‌ట్ పై అన‌ర్హ‌త వేటు ప‌డిన సంగ‌తి తెలిసిందే.

Vinesh Phogats Plea Against Olympic Disqualification Accepted By CAS

పారిస్ ఒలింపిక్స్ 2024లో భార‌త స్టార్ రెజ్ల‌ర్ వినేశ్ ఫోగ‌ట్ పై అన‌ర్హ‌త వేటు ప‌డిన సంగ‌తి తెలిసిందే. నిర్ణీత బ‌రువు క‌న్నా 100 గ్రాములు అద‌నంగా ఉంద‌న్న కార‌ణంతో ఫైన‌ల్ బౌట్ లో ఆడ‌నివ్వ‌లేదు. నిబంధ‌న‌ల ప్ర‌కారం అన‌ర్హ‌త వేటు ప‌డ‌డంతో ఆమెకు ఈ విభాగంలో చివ‌రి స్థానాన్ని కేటాయించారు. దీంతో ఆమెకు ఎలాంటి ప‌త‌కం రాకుండా పోయింది.

ఈ క్ర‌మంలో త‌నకు ర‌జ‌త ప‌త‌కం ఇవ్వాల‌ని కోర్ట్‌ ఆఫ్‌ ఆర్బిట్రేషన్‌ ఫర్‌ స్పోర్ట్స్‌ (CAS) లో వినేశ్ అప్పీల్ చేసింది. దీనిపై భార‌త కాల‌మానం ప్ర‌కారం మ‌ధ్యాహ్నం 1.30 గంట‌ల‌కు (పారిస్ కాల‌మానం ప్ర‌కారం ఉద‌యం 10 గంట‌ల‌కు) విచార‌ణ జర‌గాల్సి ఉంది. అయితే.. అది సాయంత్రానికి వాయిదా ప‌డింది.

IND vs AUS : ఆసీస్ టూర్‌లో రెండు రోజుల డే/నైట్ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడ‌నున్న భార‌త్‌.. అప్ప‌ట్లో అలా జ‌రిగినందుకేనా..?

భార‌త కాల‌మానం ప్ర‌కారం సాయంత్రం 5.30 గంట‌ల‌కు (పారిస్ కాల‌మానం ప్ర‌కారం మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు )దీనిపై విచార‌ణ జ‌ర‌గ‌నుంది. ప్ర‌ముఖ న్యాయ‌వాది హ‌రీశ్ సాల్వేతో పాటు విదుష్పత్‌ సింఘానియాల‌ను వినేశ్‌ త‌రుపున వాద‌న‌లు వినిపించేందుకు భార‌త ఒలింపిక్ సంఘం నియ‌మించింది. వీరితో పాటు న‌లుగురు స‌భ్యులు గ‌ల ఫ్రెంచ్ న్యాయ‌వాదుల బృందం కూడా ఉంది.

ఒక‌వేళ ఆర్చిట్రేష‌న్ గ‌నుకు అనుమ‌తిస్తే వినేశ్‌కు ర‌జ‌తం ద‌క్కే అవ‌కాశాలు ఉన్నాయి. దీంతో సీఏఎస్ ఎలాంటి తీర్పు ఇస్తుందోన‌నే ఆస‌క్తి భారతీయుల్లో నెల‌కొంది. అయితే.. యునైటెడ్‌ ప్రపంచ రెజ్లింగ్‌ (యూడబ్ల్యూడబ్ల్యూ) స్పందిస్తూ ఒలింపిక్స్‌లో నిబంధ‌న‌ల‌ను మార్చే అవ‌కాశం లేదంది.

Neeraj Chopra : స్వ‌ర్ణం గెలిచిన పాక్ అథ్లెట్ గురించి నీర‌జ్ చోప్రా త‌ల్లి ఏమందో తెలుసా..?

ఇదిలా ఉంటే.. అన‌ర్హ‌త వేటు ప‌డ‌డంతో వినేశ్ రెజ్లింగ్‌కు రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

ట్రెండింగ్ వార్తలు