Vinod Kambli discharged from hospital donning Team India jersey
టీమ్ఇండియా మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. తీవ్ర అనారోగ్యం బారిన పడిన ఆయన డిసెంబర్ 21న ముంబైలోని థానేలోని ఆకృతి ఆస్పత్రిలో చేరారు. మూత్ర ఇన్‌ఫెక్షన్‌తో ఆయన ఆస్పత్రిలో చేరారు. వైద్యులు నిర్వహించిన పరీక్షల్లో ఆయన మెదడులో రక్తం గడ్డ కట్టినట్లు గుర్తించారు. రెండు వారాల పాటు ఆయనకు చికిత్స అందించారు. ఆరోగ్యం మెరుగుపడడంతో బుధవారం సాయంత్రం 52 ఏళ్ల కాంబ్లీ డిశ్చార్చ్ అయ్యారు.
టీమ్ఇండియా జెర్సీలో ఆస్పత్రి నుంచి బయటకు వచ్చిన కాంబ్లీ, క్రికెట్ బ్యాట్ పట్టుకుని కొన్ని షాట్లు ఆడాడు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజలు మందు, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చాడు. న్యూ ఇయర్ విషెస్ తెలియజేశాడు. ఇక కఠిన సమయంలో తనకు మద్దతుగా నిలిచిన కుటుంబ సభ్యులు, స్నేహితులకు, అభిమానులకు కాంబ్లీ కృతజ్ఞతలు తెలిపాడు.
IND vs AUS 5th Test : ఆసీస్‌తో ఐదో టెస్టుకు ముందు భారత్‌కు భారీ షాక్.. గాయంతో స్టార్ పేసర్ ఔట్..
ఆకృతి హెల్త్ సిటీ హాస్పిటల్ డైరెక్టర్, వినోద్ కాంబ్లీ అభిమాని అయిన డాక్టర్ శైలేష్ ఠాకూర్ మాట్లాడుతూ.. క్లాంబ్లీ ఇప్పుడు పూర్తిగా కోలుకున్నాడని చెప్పారు. అందుకనే ఆయన్ను డిశ్చార్జ్ చేశామన్నారు. అయితే.. కొన్ని జాగ్రత్తలు పాటించాలని కాంబ్లీకి సూచించారు.
భారత జట్టు తరుపున 1991లో వినోద్ కాంబ్లీ అరంగ్రేటం చేశాడు. 2000లో చివరి మ్యాచ్ ఆడాడు. భారత జట్టు తరుపున 17 టెస్టులు, 104 వన్డేల్లో ప్రాతినిధ్యం వహించాడు. టెస్టుల్లో 54.2 సగటుతో 1084 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలు, మూడు అర్థశతకాలు ఉన్నాయి. ఇక వన్డేల్లో 32.6 సగటుతో 2477 పరుగులు చేశాడు. ఇందులో రెండు శతకాలు, 14 అర్థశతకాలు ఉన్నాయి.