Ajinkya Rahane : బెంగ‌ళూరుతో మ్యాచ్‌కు ముందు కేకేఆర్ కెప్టెన్‌ వీడియో వైర‌ల్‌.. చేతిలో బ్యాట్ ప‌ట్టుకుని ర‌హానే ప‌రుగో ప‌రుగు..

సోష‌ల్ మీడియాలో అజింక్యా రహానేకు సంబంధించిన ఓ వీడియో వైర‌ల్‌గా మారింది.

pic credit @kkr

ఐపీఎల్ 2025 సీజ‌న్‌కు రంగం సిద్ధ‌మైంది. కోల్‌క‌తాలోని ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా శ‌నివారం రాత్రి 7.30 గంల‌కు రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుతో కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ త‌ల‌ప‌డ‌నుంది. ఈ మ్యాచ్‌లో విజ‌యం సాధించి సీజ‌న్‌ను ఘ‌నంగా ఆరంభాల‌ని అటు కేకేఆర్ ఇటు ఆర్‌సీబీ భావిస్తున్నాయి. అయితే.. ఈ మ్యాచ్‌కు వ‌ర్షం ముప్పు పొంచి ఉంది. మ్యాచ్ జ‌రిగే స‌మ‌యంలో దాదాపు 80 శాతం వ‌ర్షం ప‌డే అవ‌కాశాలు ఉన్నాయ‌ని వాతావ‌ర‌ణ శాఖ తెలియ‌జేసింది.

వ‌ర్షం సంగ‌తి ప‌క్క‌న బెడితే.. ఐపీఎల్ 2025 సీజ‌న్‌కు కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్‌కు అజింక్యా రహానే నాయ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా, రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుకు ర‌జ‌త్ పాటిదార్ కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. ఆయా జ‌ట్ల త‌రుపున కెప్టెన్లుగా వారిద్ద‌రికి ఇదే తొలి మ్యాచ్.

Pakistan : ఏందీ మామ ఇది నిజ‌మేనా? ఏడాదైనా కొన్న బ్యాట్ల‌కు డ‌బ్బులు ఇవ్వ‌ని పాక్ స్టార్ క్రికెట‌ర్‌.. షాప్ ఓన‌ర్ కాల్ చేస్తే..!

కాగా.. మ్యాచ్‌కు ముందు సోష‌ల్ మీడియాలో అజింక్యా రహానేకు సంబంధించిన ఓ వీడియో వైర‌ల్‌గా మారింది. జట్టు బస్సును కెప్టెన్ అజింక్య రహానె మిస్ అయిన‌ట్లుగా అందులో ఉంది.

మ్యాచ్ నేప‌థ్యంలో ఆట‌గాళ్లంతా ప్రాక్టీస్ కోసం మైదానానికి వెళ్లేందుకు జ‌ట్టు బ‌స్‌లో ఉన్నారు. అయితే. కెప్టెన్ ర‌హానే లేకుండానే బ‌స్ క‌దులుతున్న‌ట్లుగా తెలుస్తోంది. దీంతో ర‌హానే చేతిలో బ్యాట్ ప‌ట్టుకుని బ‌స్ కోసం వేగంగా ప‌రిగెడుతున్న‌ట్లుగా వీడియోలో ఉంది. ఈ వీడియో పై నెటిజ‌న్లు స‌రదాగా కామెంట్లు చేస్తున్నారు. బ‌స్ మిస్సైన ప‌ర్లేదు గానీ మ్యాచ్‌ను మిస్ చేయ‌కు అని అంటున్నారు.

IPL Firsts : ఐపీఎల్‌లో తొలి సంగ‌తులు.. ఫ‌స్ట్ టాస్, ఫ‌స్ట్ ఫోర్‌, ఫ‌స్ట్ సిక్స్‌, ఫ‌స్ట్ సెంచ‌రీ ఇంకా..

కాగా.. ప్రాక్టీస్ కోసం లేదా మ్యాచ్ కోసం అయినా స‌రే ఆట‌గాళ్లు అంతా ఒకే బ‌స్‌లో ప్ర‌యాణించాల‌ని, స్టార్ క్రికెట‌ర్లు అయిన స‌రే టీమ్‌తో కాకుండా విడిగా ప్ర‌యాణించ‌కూడ‌ద‌నే నిబంధ‌న‌ను ఈ సీజ‌న్‌కు ముందు తీసుకువ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.

ఇదిలా ఉంటే.. ఐపీఎల్ ప్రారంభానికి ముందు కేకేఆర్ మాజీ కెప్టెన్ సౌర‌వ్ గంగూలీ మాట్లాడుతూ.. ఈ సారి అన్ని జ‌ట్లు స‌మ‌తుల్యంగా ఉన్నాయ‌న్నాడు. విజేత‌గా ఎవ‌రు నిలుస్తారు ఇప్పుడే చెప్ప‌డం చాలా తొంద‌ర‌పాటు అవుతుంద‌న్నాడు.

KKR vs RCB : కోల్‌క‌తాతో మ్యాచ్‌.. బెంగ‌ళూరు కోచ్ వార్నింగ్‌.. నిజం చెబుతున్నా వామ్మో కోహ్లీ..

ఐపీఎల్ 2025 కోసం కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు..

క్వింటన్ డికాక్ (వికెట్ కీప‌ర్‌), సునీల్ నరైన్, అజింక్య రహానే (కెప్టెన్‌), అంగ్‌క్రిష్ రఘువంశీ, వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, ఆండ్రీ ర‌సెల్‌, రమణ్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, స్పెన్సర్ జాన్సన్, వైభవ్ అరోరా, రహ్మానుల్లా గుర్బాజ్, మనీష్ పాండే, మోయిన్ అలీ, అన్రిచ్ నోర్ట్జే, రోవ్‌మన్ పావెల్, అనుకుల్ రాయ్, మయాంక్ మార్కండే, చేతన్ సకారియా, లువ్నిత్ సిసోడియా.