దేవుడా..! ఏడాదైనా.. కొన్న బ్యాట్లకు డబ్బులు ఇవ్వని పాక్ స్టార్ క్రికెటర్.. షాప్ ఓనర్ కాల్ చేస్తే..!
పాకిస్తాన్ స్టార్ ప్లేయర్ ఒకరు తాను కొన్న బ్యాట్లకు డబ్బులు ఇవ్వలేదట.

పాకిస్తాన్ క్రికెట్ జట్టు అనిశ్చితికి మారు అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ జట్టు ఎప్పుడు ఎలా ఆడుతుందో ఆ జట్టు అభిమానులకు సైతం అంతు పట్టదు. ఓ మ్యాచ్‌లో అద్భుత ఆటతీరుతో అలరిసే ఆ వెంటనే మరుసటి మ్యాచ్‌లో చెత్త ప్రదర్శన చేయడం చూస్తూనే ఉన్నాం. భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్ 2023, వెస్టిండీస్, అమెరికా దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇచ్చిన టీ20 ప్రపంచకప్ 2024లతో పాటు ఇటీవల ముగిసిన ఛాంయన్స్ ట్రోఫీ 2025లోనూ ఆ జట్టు పేలవ ఆటతీరును ప్రదర్శించింది. దీంతో ఆ జట్టు పై విమర్శలు వస్తున్నాయి.
ఇదిలా ఉంటే.. ఆ దేశ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించడం వల్ల భారీగా నష్టపోయినట్లు వార్తలు వస్తుండగా తాజాగా మరో విషయం వెలుగులోకి వచ్చింది. పాకిస్తాన్ స్టార్ ప్లేయర్ ఒకరు తాను కొన్న బ్యాట్లకు డబ్బులు ఇవ్వలేదట. పాపం సదరు షాప్ యజమాని సంవత్సర కాలంగా డబ్బుల కోసం ఎదురుచూస్తూనే ఉన్నాడట. ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
A popular Pakistani player brought 3 bats from a cricket store in New Jersey during last year’s T20 World Cup.
The owner is still waiting for his payments and the player is not responding to his calls. (Waheed Khan). pic.twitter.com/PNBA1c5CeV
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 21, 2025
‘టీ20 ప్రపంచకప్ 2024కి ముందు పాకిస్తాన్ స్టార్ ఆటగాడు ఒకరు.. న్యూజెర్సీలోని ఓ దుకాణానికి వెళ్లి మూడు బ్యాట్లను కొనుగోలు చేశాడు. సదరు షాపు యజమాని స్వయంగా ఆ బ్యాట్లను సదరు స్టార్ ప్లేయర్‌కి డెలివరీ చేశాడు. కానీ ఇంతవరకు సదరు ప్లేయర్.. ఆ షాపు యజమానికి డబ్బులు చెల్లించలేదు. అంతేకాదు.. ఆ షాపు యజమాని కాల్ చేసినా కూడా సదరు ఆటగాడు స్పందించడం లేదు.’ అని పాకిస్తాన్ సీనియర్ జర్నలిస్ట్ వహీద్ ఖాన్ తన సోషల్ మీడియాలో రాసుకొచ్చాడు.
అయితే.. సదరు స్టార్ ప్లేయర్ ఎవరు అనే విషయాన్ని మాత్రం చెప్పలేదు. కాగా.. ఈ వార్తలో ఎంత నిజం ఉందనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం పాక్ పరువు పోవడం ఖాయం.
KKR vs RCB : కోల్‌కతాతో మ్యాచ్.. బెంగళూరు కోచ్ వార్నింగ్.. నిజం చెబుతున్నా వామ్మో కోహ్లీ..
ప్రస్తుతం పాకిస్థాన్ జట్టు న్యూజిలాండ్ పర్యటనలో ఉంది. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయినా మూడో టీ20లో విజయం సాధించింది పాక్. ప్రస్తుతం మూడు మ్యాచ్‌లు ముగిసే సరికి పాక్ 1-2తో వెనుకబడి ఉంది.