KKR vs RCB : కోల్‌కతాతో మ్యాచ్.. బెంగళూరు కోచ్ వార్నింగ్.. నిజం చెబుతున్నా వామ్మో కోహ్లీ..
తొలి మ్యాచ్‌కు ముందు కేకేఆర్‌కు ఆర్‌సీబీ హెడ్‌కోచ్ వార్నింగ్ ఇచ్చాడు.

RCB head coach gives warning KKR ahead of match in IPL 2025
క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. ఐపీఎల్ 2025 సీజన్ నేటి (మార్చి 22) నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ తలపడనుంది. ఈ మ్యాచ్‌కు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదిక కానుంది. కాగా.. ఈ మ్యాచ్‌కు కోల్‌కతా జట్టుకు బెంగళూరు కోచ్ ఆండీ ప్లవర్ వార్నింగ్ ఇచ్చాడు.
మ్యాచ్‌కు ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆండీ ఫ్లవర్‌కు ఓ ప్రశ్న ఎదురైంది. కోల్‌కతా నుంచి బెంగళూరుకు కష్టాలు తప్పవా? అంటూ ఓ రిపోర్టర్ అడుగగా ఆండీ ఫ్లవర్ ధీటుగా సమాధానం ఇచ్చాడు. ‘అవును ఈ మ్యాచ్ ఎంతో భయంకరంగా ఉండబోతుంది. అయితే.. ఇబ్బందులు కోల్‌కతా నుంచి బెంగళూరుకు కాదు.. ఆర్‌సీబీ నుంచే కేకేఆర్‌కు కష్టాలు తప్పవు.’ అంటూ సమాధానం ఇచ్చాడు. ఇక ఈ మ్యాచ్‌తో ఐపీఎల్ 2025 సీజన్ ఎంతో ఘనంగా ప్రారంభం అవుతుందని తాను భావిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు.
ఇక కొత్త కెప్టెన్ రజత్ పాటిదార్‌పై పూర్తి నమ్మకం ఉన్నట్లుగా చెప్పాడు. అనుభం ఉన్న ఆటగాళ్లతో జట్టును నింపేసినట్లుగా తెలిపాడు. ఆటగాళ్లంతా రజత్‌కు మద్దతుగా నిలుస్తారన్నాడు. ఇక రజత్ సైతం సవాళ్లకు సిద్ధంగా ఉన్నాడన్నారు.
స్పిన్నర్లతో ఛాలెంజ్..
‘కేకేఆర్ టీమ్‌లో ఇద్దరు నాణ్యమైన స్పిన్నర్లు ఉన్నారు. వారే వరుణ్‌చక్రవర్తి, సునీల్ నరైన్. వీరిద్దరు మంచి లయతో బౌలింగ్ చేస్తున్నారు. అత్యుత్తమ జట్టుతో ఆడినప్పుడే మన సత్తా ఏంటో ప్రపంచానికి తెలుస్తుంది. అది అంతర్జాతీయ మ్యాచ్ అయినా.. ఐపీఎల్ అయినా సరే.’ అని ఆండీ ఫ్లవర్ తెలిపారు.
ఇటీవల కాలంలో బ్యాటర్లు చాలా దూకుడుగా ఆడుతున్నారని ఆండీ ఫ్లవర్ తెలిపారు. దీంతో భారీ స్కోర్లు నమోదు అవుతున్నాయన్నారు. ఇక విరాట్ కోహ్లీ లాంటి ప్లేయర్లకు ఐపీఎల్ మంచి వేదిక అన్నారు. అతడి ఫిట్‌నెస్ అద్భుతం అని, కుర్రాడిలా ఉన్నాడన్నారు. నాణ్యమైన, తెలివైన క్రికెట్ ఆడడంలో క్లోహీ వేరే లెవల్ అని ఆండీ ఫ్లవర్ అన్నాడు.