David Warner : సన్‌రైజర్స్ హైదరాబాద్ తొలి మ్యాచ్‌లో డేవిడ్ వార్నర్ సందడి.. ఒంటరిగా కాదండోయ్.. తన టీమ్‌తో..
ఐపీఎల్ 2025 సీజన్‌లో ఎస్ఆర్‌హెచ్ తొలి మ్యాచ్‌లో వార్నర్ సందడి చేయనున్నాడు.

David Warner appearance in ipl 2025 alone with robinhood team
డేవిడ్ వార్నర్.. భారత క్రికెట్ అభిమానులకు ముఖ్యంగా తెలుగు వారికి పరిచయం అక్కరలేని పేరు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పేరు చెప్పగానే టక్కున గుర్తొచ్చే పేరు. ఈ మాజీ ఆస్ట్రేలియా ఆటగాడు 2016లో సనరైజర్స్ హైదరాబాద్‌కు ఐపీఎల్ ట్రోఫీని అందించాడు. ఆ తరువాత ఇప్పటి వరకు మరోసారి ఐపీఎల్ ట్రోఫీని అందుకోలేదు ఎస్ఆర్‌హెచ్.
ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన వార్నర్.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టీ20 లీగుల్లో ఆడతానని ప్రకటించాడు. అయినప్పటికి ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఈ స్టార్ ఆటగాడికి నిరాశే ఎదురైంది. ఒక్కటంటే ఒక్క ఫ్రాంచైజీ కూడా ఈ విధ్వంసకర ఆటగాడిని కొనుగోలు చేసేందుకు ముందుకు రాలేదు దీంతో వార్నర్ అన్‌సోల్డ్‌గా మిగిలిపోయాడు. దీంతో వార్నర్ కాకను ఐపీఎల్ 2025లో చూడలేమని ఫ్యాన్స్ నిరాశచెందారు.
IPL 2025 : హైదరాబాద్ క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగే.. ఉప్పల్ స్టేడియంలో ఏకంగా 9 మ్యాచ్‌లు..
View this post on Instagram
అయితే.. ఐపీఎల్‌కు దూరం అయినప్పటికి తెలుగు వారికి మాత్రం వార్నర్ దూరం కాలేదు. ఈ సారి ఆటతో కాదు తన యాక్టింగ్‌తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధం అయ్యాడు. నితిన్ హీరోగా నటిస్తున్న చిత్రం రాబిన్‌హుడ్‌లో వార్నర్ ఓ పాత్రను పోషించాడు. శ్రీలీల కథానాయికగా నటించిన ఈ మూవీ మార్చి28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్ర ప్రమోషనల్స్‌లో వార్నర్ భాగం అవుతున్నాడు.
అందులో భాగంగా ఈ ఐపీఎల్ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆడనున్న తొలి మ్యాచ్‌లో వార్నర్ కనిపించనున్నాడు. మార్చి 23న (ఆదివారం) సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్ ఆడనుంది. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో వార్నర్‌తో పాటు హీరో నితిన్, హీరోయిన్ శ్రీలీల ప్రేక్షకులను అలరించడంతో పాటు తమ చిత్రాన్ని ప్రమోట్ చేసుకునేందుకు వస్తున్నారు.
స్టార్ స్పోర్ట్స్ తెలుగు ఛానెల్‌లో వీరు సందడి చేయనున్నారు. ఈ విషయాన్ని స్టార్‌స్పోర్ట్స్ తెలుగు ఛానెల్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించింది. ఇలాంటి సూపర్ కాంబినేషన్‌ను చూసే అవకాశం మళ్ళీ మళ్ళీ వస్తుందా.! RobinHood మూవీ టీం నితిన్, డేవిడ్ వార్నర్ & శ్రీలీల మనల్ని అలరించడానికి రాబోతున్నారు! మిస్ కాకుండా ట్యూన్ ఇన్ అయిపొండి! అంటూ రాసుకొచ్చింది.