KKR vs RCB : కోల్‌కతా వర్సెస్ బెంగళూరు మ్యాచ్.. వర్షం వల్ల రద్దైతే పరిస్థితి ఏంటి..? ఏ జట్టు లాభపడుతుంది?
ఐపీఎల్ 18వ సీజన్‌లో ప్రారంభ మ్యాచ్ కేకేఆర్ వర్సెస్ ఆర్‌సీబీ జట్ల మధ్య జరగనుంది. ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది.

What happens if KKR vs RCB match abandoned by rain in IPL 2025
క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2025 సీజన్‌కు రంగం సిద్ధమైంది. నేటి (మార్చి 22) నుంచి ఐపీఎల్ 18వ సీజన్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తలపడనుంది. కాగా.. ఈ ఓపెనర్ మ్యాచ్ 2008 ఐపీఎల్ ఆరంభ సీజన్ తొలి మ్యాచ్ కేకేఆర్ వర్సెస్ ఆర్‌సీబీ మ్యాచ్‌ను గుర్తు చేస్తుంది. నాటి మ్యాచ్‌లో బ్రెండన్ మెక్‌కల్లమ్ (158*) విధ్వంసకర శతకాన్ని సగటు క్రికెట్ అభిమాని ఎన్నటికి మర్చిపోలేడు.
ఆ తరువాత ఎందరో సెంచరీలు చేసినా, ఎన్ని మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడినా మెక్‌కల్లమ్ ఇన్నింగ్స్ చాలా స్పెషల్. ఇందుకు చాలా కారణాలు ఉన్నాయి. ఐపీఎల్‌లో ఇదే తొలి సెంచరీ. ఐపీఎల్‌కు క్రేజ్ రావడానికి అతడి ఇన్నింగ్స్ ఓ కారణం అని చెప్పవచ్చు.
IPL 2025 : హైదరాబాద్ క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగే.. ఉప్పల్ స్టేడియంలో ఏకంగా 9 మ్యాచ్‌లు..
ఐపీఎల్‌లో ఇప్పటి వరకు 17 సీజన్లు పూర్తి అయ్యాయి. నేటి నుంచి 18వ సీజన్ ఆరంభం కానుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా తొలి మ్యాచ్‌లో కేకేఆర్ వర్సెస్ ఆర్‌సీబీ తలపడనుంది. అయితే.. ఈమ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉన్నట్లు వాతావరణ శాఖ తెలియజేసింది.
మ్యాచ్ జరిగే సమయంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశాలు దాదాపు 70 శాతం ఉన్నట్లు పేర్కొంది. ఇప్పటికే శుక్రవారం వర్షం కారణంగా కోల్‌కతా, బెంగళూరు జట్ల ఆటగాళ్ల ప్రాక్టీస్ కు అంతరాయం కలిగింది. మైదానాన్ని కవర్లతో కప్పి ఉంచారు.
వర్షం వల్ల మ్యాచ్ రద్దైతే..
ఇక వర్షం వల్ల మ్యాచ్ రద్దు అయితే పరిస్థితి ఏంటి అనే విషయాలను ఓ సారి చూద్దాం..
IPL 2025 : ఆర్‌సీబీ పూర్తి షెడ్యూల్ ఇదే.. మ్యాచ్‌లు, తేదీలు, సమయాలు, వేదికలు, ప్రత్యర్థులు
వర్షం పడి మ్యాచ్ రద్దు అయితే.. కేకేఆర్, ఆర్‌సీబీ జట్లకు చెరో పాయింట్‌ను కేటాయిస్తారు. ఎందుకంటే లీగ్ మ్యాచ్‌లకు రిజర్వ్ డే అందుబాటులో లేదు. ఒకవేళ మ్యాచ్ రద్దు అయితే ఏ జట్టుకు లాభం, ఏ జట్టుకు నష్టం అన్నది ఇప్పుడే చెప్పలేము. ఈ సీజన్‌లలో ఆయా జట్లు సాధించే విజయాలపై మాత్రమే ఇది ఆధారపడి ఉంటుంది. ఒక్కొసారి మ్యాచ్ రద్దు కావడం జట్లకు లాభం చేకూర్చవచ్చు లేదా నష్టం చేకూర్చవచ్చు.
ఏదీ ఏమైనప్పటికి మ్యాచ్ మాత్రం సజావుగా సాగాలని సగటు క్రీడాభిమాని కోరుకుంటున్నారు.