IPL 2025 : హైద‌రాబాద్ క్రికెట్ ఫ్యాన్స్‌కు పండ‌గే.. ఉప్ప‌ల్ స్టేడియంలో ఏకంగా 9 మ్యాచ్‌లు..

ఐపీఎల్ 2025 సీజ‌న్‌లో హైద‌రాబాద్‌లోని ఉప్ప‌ల్ మైదానంలో ఏకంగా 9 ఐపీఎల్ మ్యాచ్‌లు జ‌ర‌గ‌నున్నాయి.

IPL 2025 : హైద‌రాబాద్ క్రికెట్ ఫ్యాన్స్‌కు పండ‌గే.. ఉప్ప‌ల్ స్టేడియంలో ఏకంగా 9 మ్యాచ్‌లు..

Updated On : March 22, 2025 / 8:54 AM IST

క్రికెట్ ప్రేమికులు ఎంత‌గానో ఎదురుచూస్తున్న రోజు రానే వ‌చ్చింది. ఐపీఎల్ 2025 సీజన్ నేటి (మార్చి 22) నుంచి ప్రారంభం కానుంది. కోల్‌క‌తాలోని ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా డిఫెండింగ్ ఛాంపియ‌న్ కోల్‌క‌తానైట్‌రైడ‌ర్స్‌తో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్టు త‌ల‌ప‌డ‌నుంది. రాత్రి 7.30 గంట‌లకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.

ఈ సీజ‌న్‌లో 9 ఐపీఎల్ మ్యాచ్‌ల‌ను హైద‌రాబాద్ వాసులు ప్ర‌త్య‌క్షంగా వీక్షించొచ్చు. స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ హోం గ్రౌండ్ అయిన ఉప్ప‌ల్ స్టేడియంలో ఈ మ్యాచ్‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఇందులో ఏడు మ్యాచ్‌లు లీగ్ మ్యాచ్‌లు కాగా.. ఓ క్వాలిఫ‌య‌ర్, ఓ ఎలిమినేట‌ర్ మ్యాచ్‌ల‌ను ఉప్ప‌ల్ స్టేడియం ఆతిథ్యం ఇవ్వ‌నుంది. మ‌రి ఉప్ప‌ల్‌లో ఏ రోజు, ఏ మ్యాచ్ జ‌ర‌గ‌నుందో ఓ సారి చూద్దాం..

IPL 2025 : ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు డ‌కౌట్లు అయిన ఆట‌గాళ్లు వీరే.. రోహిత్ శ‌ర్మ నుంచి పీయూష్ చావ్లా వ‌ర‌కు..

ఐపీఎల్ 18వ సీజ‌న్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టు త‌న తొలి మ్యాచ్‌ను మార్చి 23న రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌తో ఆడ‌నుంది. ఇందుకు ఉప్ప‌ల్ స్టేడియం వేదిక కానుంది.

ఉప్ప‌ల్ స్టేడియంలో జ‌రిగే మ్యాచ్‌ల వివ‌రాలు ఇవే..

* మార్చి 23న – స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ వ‌ర్సెస్ రాజ‌స్థాన్ రాయ‌ల్స్ – మధ్యాహ్నం 3.30 గంట‌ల‌కు
* మార్చి 237న – స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ వ‌ర్సెస్ ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ – రాత్రి 7.30 గంట‌ల‌కు
* ఏప్రిల్ 6న – స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ వ‌ర్సెస్ గుజ‌రాత్ టైటాన్స్ – రాత్రి 7.30 గంట‌ల‌కు
* ఏప్రిల్ 12న – స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ వ‌ర్సెస్ పంజాబ్ కింగ్స్ – రాత్రి 7.30 గంట‌ల‌కు

IPL 2025 captains : ఐపీఎల్ 2025 సీజ‌న్‌లో ఏ జ‌ట్టుకు ఎవ‌రు కెప్టెన్‌గా ఉన్నారంటే.. పూర్తి జాబితా ఇదే..

* ఏప్రిల్ 23న – స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ వ‌ర్సెస్ ముంబై ఇండియ‌న్స్ – రాత్రి 7.30 గంట‌ల‌కు
* మే 5న – స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ వ‌ర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ – రాత్రి 7.30 గంట‌ల‌కు
* మే 10న – స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ వ‌ర్సెస్ హైద‌రాబాద్ – రాత్రి 7.30 గంట‌ల‌కు
* మే 20న – క్వాలిఫ‌య‌ర్ -1 – రాత్రి 7.30 గంట‌ల‌కు
* మే 23న ఎలిమినేట‌ర్ – రాత్రి 7.30 గంట‌ల‌కు