IPL Firsts : ఐపీఎల్‌లో తొలి సంగతులు.. ఫస్ట్ టాస్, ఫస్ట్ ఫోర్, ఫస్ట్ సిక్స్, ఫస్ట్ సెంచరీ ఇంకా..
ఐపీఎల్‌లో తొలిసారి టాస్ గెలిచింది ఎవరు ? తొలి బంతి ఆడింది ఎవరు ? తొలి బంతి వేసింది ఎవరు? తొలి హాఫ్ సెంచరీ చేసింది ఎవరు? తొలి సెంచరీ చేసింది ఎవరు? వంటి విషయాలను ఓ సారి చూద్దాం..

pic credit@ipl
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. క్రికెట్ అభిమానులను ఎంతగానో అలరిస్తోంది. ఈ లీగ్‌లో కనీసం ఒక్కసారైనా ఆడాలని ప్రతి ఒక్క క్రికెటర్ కోరుకుంటాడు అంటే అతిశయోక్తి కాదేమో. ఇప్పటి వరకు 17 సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకుంది. నేటి నుంచి 18వ సీజన్ ప్రారంభం కాబోతుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు తలపడనుంది
ఇక్కడ ఆసక్తికర విశేషం ఏంటంటే.. ఐపీఎల్ ప్రారంభ (2008) సీజన్‌లో తొలి మ్యాచ్ కేకేఆర్, బెంగళూరు జట్ల మధ్య జరగడం విశేషం. నాటి మ్యాచ్ కేకేఆర్ ఆటగాడు బ్రెండన్ మెకల్లమ్ శివాలెత్తాడు. ఐపీఎల్‌లో తొలి సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డులకు ఎక్కాడు. ఇక ఈ లీగ్ ద్వారా ఎంతో మంది యువ ఆటగాళ్లు వెలుగులోకి వచ్చి.. అంతర్జాతీయ క్రికెట్‌లో సత్తా చాటారు. రవీంద్ర జడేజా, షేన్ వాట్సన్, జస్‌ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా వంటి ఈ లీగ్ ద్వారానే వెలుగులోకి వచ్చారు.
KKR vs RCB : కోల్‌కతాతో మ్యాచ్.. బెంగళూరు కోచ్ వార్నింగ్.. నిజం చెబుతున్నా వామ్మో కోహ్లీ..
ఇదిలా ఉంటే.. ఈ లీగ్‌లో తొలిసారి టాస్ గెలిచింది ఎవరు ? తొలి బంతి ఆడింది ఎవరు ? తొలి బంతి వేసింది ఎవరు? తొలి హాఫ్ సెంచరీ చేసింది ఎవరు? తొలి సెంచరీ చేసింది ఎవరు? వంటి విషయాలను ఓ సారి చూద్దాం..
ఐపీఎల్‌లో తొలి సంగతులు..
ఐపీఎల్ ఫస్ట్ మ్యాచ్.. ఐపీఎల్ 2008లో ప్రారంభమైంది. తొలి మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్ల మధ్య జరిగింది. ఏప్రిల్ 18న జరిగిన ఈ మ్యాచ్‌కు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికైంది.
ఐపీఎల్ తొలి టాస్.. అప్పటి ఆర్‌సీబీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్
ఐపీఎల్‌లో మొదటి బంతి ఆడింది ఎవరు.. సౌరవ్ గంగూలీ (కెకెఆర్)
ఐపీఎల్‌లో మొదటి బంతిని ఎవరు వేశారు.. ప్రవీణ్ కుమార్ (ఆర్‌సీబీ)
ఐపీఎల్‌లో ఫస్ట్ ఫోర్ కొట్టింది ఎవరు.. బ్రెండన్ మెకల్లమ్
ఐపీఎల్‌లో తొలి సిక్స్ కొట్టింది ఎవరు.. బ్రెండన్ మెకల్లమ్
ఐపీఎల్‌లో తొలి వికెట్.. సౌరవ్ గంగూలీ తొలి వికెట్‌గా ఔట్ అయ్యాడు. జహీర్ ఖాన్ బౌలింగ్‌లో జాక్వెస్ కాలిస్‌కు అందుకున్నాడు.
ఐపీఎల్‌లో తొలి అర్ధశతకం .. బ్రెండన్ మెకల్లమ్
ఐపీఎల్‌లో తొలి సెంచరీ.. బ్రెండన్ మెకల్లమ్ (158)
ఐపీఎల్‌లో తొలి విజయం.. ఆర్‌సీబీపై 140 పరుగుల తేడాతో కేకేఆర్ గెలుపు
ఐపీఎల్‌లో తొలి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్.. బ్రెండన్ మెకల్లమ్
ఐపీఎల్‌లో సెంచరీ చేసిన తొలి భారతీయుడు.. మనీష్ పాండే (ఆర్‌సీబీ) vs డెక్కన్ ఛార్జర్స్ (2009)
ఐపీఎల్‌లో హ్యాట్రిక్ సాధించిన తొలి ఆటగాడు.. లక్ష్మీపతి బాలాజీ (సీఎస్‌కే) vs పంజాబ్ కింగ్స్ (2008)
ఐపీఎల్‌లో ఐదు వికెట్లు తీసిన తొలి ఆటగాడు.. సోహైల్ తన్వీర్ (రాజస్థాన్ రాయల్స్) vs CSK (2008)
తొలి ఐపీఎల్ ఛాంపియన్.. రాజస్థాన్ రాయల్స్ (2008)
ఐపీఎల్‌లో తొలి పర్పుల్ క్యాప్ విజేత.. సోహైల్ తన్వీర్ (రాజస్థాన్ రాయల్స్) – 22 వికెట్లు
ఐపీఎల్‌లో తొలి ఆరెంజ్ క్యాప్ విజేత.. షాన్ మార్ష్ (కింగ్ ఎలెవన్ పంజాబ్) – 616 పరుగులు
ఐపీఎల్‌లో 200+ పరుగులు చేసిన తొలి జట్టు.. కోల్‌కతా నైట్ రైడర్స్ (222/3) బెంగళూరు పై (2008లో)
ఐపీఎల్‌లో మొదటి రనౌట్.. 2008లో ఆష్లే నోఫ్కే (ఆర్‌సీబీ) vs కేకేఆర్
ఐపీఎల్‌లో తొలిసారి స్టంపింగ్.. మార్క్ బౌచర్ (ఆర్‌సీబీ) ఐపీఎల్‌లో తొలి స్టంపింగ్ చేశాడు. బాలచంద్ర అఖిల్ బౌలింగ్‌లో రాబిన్ ఉతప్ప (ముంబై ఇండియన్స్) స్టంపౌంట్ అయ్యాడు.
ఐపీఎల్‌లో తొలి ఇంపాక్ట్ ప్లేయర్.. తుషార్ దేశ్‌పాండే (సీఎస్‌కే)
ఐపీఎల్‌లో తొలి ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు.. శ్రీవాత్స్ గోస్వామి (ఆర్‌సీబీ)