Viral vido Hardik Shares Cricketing Knowledge With Son Agastya
టీమ్ఇండియా టెస్టు జట్టులో స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా భాగం కాకపోవడంతో ప్రస్తుతం అతడికి చాలా విరామం దొరికింది. ఈ సమయాన్ని అతడు తన కొడుకు అగస్త్యతో సరదాగా గడుపుతున్నాడు. ఈ విషయాన్ని తెలియజేస్తూ పాండ్యా తన సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేశాడు.
ఒక నిమిషం 9 సెకన్లు ఉన్న ఈ వీడియోలో హార్దిక్ తన వద్ద ఉన్న బ్యాట్లలో మూడు వేరే వేరే బరువులు ఉన్న బ్యాట్లను తూకం వేశాడు. ఆ మూడింటిలో ఏది బరువుగా ఉంది. ఏదీ తేలికగా ఉందో చెప్పాలని తన 5 ఏళ్ల కొడుకు అగస్త్యను అడుగుతాడు. ఇక అగస్త్య కూడా చాలా చక్కగా సమాధానం చెబుతాడు. అంతేకాదండోయ్ బరువైన బ్యాట్‌తో సిక్సర్లు కొట్టవచ్చునని అంటాడు. కొడుకు ముద్దు మాటలను వింటూ హార్దిక్ సంతోషంగా కనిపించాడు.
Had to get my resident cricket expert Agastya to weigh in on my bat selection 🥰 pic.twitter.com/LlPL1Y6EGj
— hardik pandya (@hardikpandya7) July 25, 2025
ఇక ఈ వీడియోకి.. ‘నా బ్యాట్ సెలక్షన్ గురించి నా స్థానిక క్రికెట్ నిపుణుడు అగస్త్య నుంచి సలహాలు తీసుకున్నాను.’అంటూ హార్దిక్ ఈ వీడియోకి క్యాపన్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
ENG vs IND : శుభ్‌మన్ గిల్‌ను చిక్కుల్లో పడేసిన బౌలింగ్ కోచ్.. అరెరె ఇప్పుడెలా సామీ..
ఐపీఎల్ 2025 సీజన్‌లో ముంబై ఇండియన్స్ జట్టుకు హార్దిక్ నాయకత్వం వహించాడు. ఈ సీజన్‌లో ముంబై ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. క్వాలిఫయర్-2లో ఓడిపోవడంతో ఈ సీజన్ నుంచి నిష్ర్కమించారు. జట్టును ప్లేఆఫ్స్‌కు చేర్చడంలో హార్దిక్ కీలక పాత్ర పోషించాడు. 15 మ్యాచ్‌ల్లో 163.50 స్ట్రైక్ రేటుతో 224 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో 14 వికెట్లు తీశాడు.