మరో అవకాశం ఇవ్వండి: కోహ్లీ, డివిలియర్స్

మరో అవకాశం ఇవ్వండి: కోహ్లీ, డివిలియర్స్

Updated On : May 4, 2019 / 11:00 AM IST

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాట్స్‌మెన్ డివిలియర్స్, కోహ్లీలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పర్సనల్ మెసేజ్ షేర్ చేసుకున్నారు. ఈ సీజన్లో రాణించలేకపోయమాని ఒప్పుకుంటూ మీ ఆదరాభిమానాలు ఇలాగే కొనసాగితే వచ్చే సంవత్సరం బాగా రాణిస్తామని నమ్మకాన్ని వ్యక్తపరిచారు. 

2019సీజన్లో ఆర్సీబీ ఆడనున్న చివరి మ్యాచ్‌కు బెంగళూరు వేదికగా జరగనుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌కు ముందు ఆర్సీబీ ప్లేయర్లు డివిలియర్స్, విరాట్ కోహ్లీ ఓ ప్రత్యేకమైన మెసేజ్‌ను పంపారు. వర్షంతో ఆగిపోయిన మ్యాచ్ గురించి డివిలియర్స్ మాట్లాడుతూ.. చివరి ఓవర్ అంటే చివరి 5ఓవర్లతో సమానం. ఆ గేమ్ ఫలితం తేలకపోయినప్పటికీ నాకు జీవితాంతం గుర్తుంటుంది’ అని వెల్లడించాడు. 

కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడుతూ..సీజన్లో ఇంకా మిగిలి ఉంది ఒక మ్యాచ్ మాత్రమే. మేం చేయగలిగినంత చేశాం. చాలా బాధగా ఉంది. సీజన్లో జట్టు ప్రదర్శన మీతో పాటు మమ్మల్ని కూడా నిరాశపరిచింది. వర్షం వచ్చిన్పపటికీ స్టేడియంలో మ్యాచ్ కోసం ఎదురుచూస్తూ ఉండిపోయారు. మీ అందరికీ కృతజ్ఞతలు’ అని కోహ్లీ తెలిపాడు. 

డివిలియర్స్ మరోసారి కలగజేసుకుంటూ.. ‘ఇలాగే మీ ప్రోత్సాహం అందిస్తూ ఉండండి. వచ్చే సీజన్లో రాణించేందుకు ప్రయత్నిస్తాం’ అని వివరించాడు. బెంగళూరు పేలవ ప్రదర్శనతో ప్లేఆఫ్‌కు అర్హత సాధించకపోవడంతో శనివారం తన ఆఖరి మ్యాచ్‌ను సన్‌రైజర్స్‌తో ఆడనుంది. ఈ మ్యాచ్‌కు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదిక కానుంది.