Virat Kohli breaks the internet: కోహ్లి క్రేజ్ మామూలుగా లేదు.. సోషల్ మీడియాను షేక్ చేసేస్తున్నాడు

Virat Kohli breaks the internet: టీమిండియా మాజీ కెప్టెన్సీ వదులుకున్నా విరాట్ కోహ్లి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. మైదానంలో అగ్రెసివ్ ఆటతో విరుచుకుపడే కోహ్లికి పిచ్చ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

Virat Kohli breaks the internet: కోహ్లి క్రేజ్ మామూలుగా లేదు.. సోషల్ మీడియాను షేక్ చేసేస్తున్నాడు

Virat Kohli breaks the internet: టీమిండియా మాజీ కెప్టెన్సీ వదులుకున్నా విరాట్ కోహ్లి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. మైదానంలో అగ్రెసివ్ ఆటతో విరుచుకుపడే కోహ్లికి పిచ్చ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తాజాగా బుధవారం అతడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచాడు. రెండు కారణాలతో అతడు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాడు. ఇన్ స్టాగ్రామ్ లో కోహ్లి పోస్ట్ చేసిన లాంగ్ డ్రైవ్ వీడియో అభిమానులను ఆకట్టుకుంటోంది. ఇక ఆట కంటే తానే గొప్పవాడిలా కోహ్లి ఫీలవుతాడని ఆలిండియా సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా ఉన్న భారత మాజీ పేసర్ చేతన్ శర్మ చేసిన వ్యాఖ్యలు బయటకు రావడం కలకలం రేపింది.

బోర్డర్ గవాస్కర్ ట్రోఫిలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండు టెస్ట్ శుక్రవారం నుంచి ఢిల్లీలో ప్రారంభం కానుంది. కోహ్లి సొంత మైదానం కావడంలో అతడి అభిమానులు సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తున్నారు. కోహ్లి ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ అతడికి మద్దతుగా కామెంట్లు పెడుతున్నారు.

చాలా రోజుల తర్వాత ఢిల్లీలో స్టేడియానికి ఇలా లాంగ్ డ్రైవ్ చేసుకుంటూ రావడం.. మాటల్లో చెప్పలేని అనుభూతి అంటూ ఇన్ స్టాలో కోహ్లి వీడియో పంచుకున్నాడు. కాగా, ఫిరోజ్ షా కోట్ల మైదానంలో ఉన్న విరాట్ కోహ్లి పెవిలియన్ ఫొటో ట్విటర్ లో తెగ షేర్ చేస్తున్నారు అభిమానులు. భారత జాతీయ జట్టులో స్థానమే లక్ష్యంగా చిన్నప్పుడు కోహ్లి ఇక్కడ సాధన చేశాడని.. ఇప్పుడు అదే స్టేడియంలో ఒక పెవిలియన్ కు అతడి పేరు పెట్టారని గుర్తు చేస్తున్నారు. రెండో టెస్ట్ మ్యాచ్ సందర్భంగా ఆస్ట్రేలియా ఆటగాళ్లు విరాట్ కోహ్లి పెవిలియన్ లో కూర్చొబోతున్నారని వెల్లడించారు.


అటు చేతన్ శర్మపై కోహ్లి అభిమానులు కారాలు మిరియాలు నూరుతున్నారు. చేతన్ శర్మకు వ్యతిరేకంగా కామెంట్లు పెడుతున్నారు. 17వ ఏట అంతర్జాతీయ అరంగేట్రం చేసిన చేతన్ శర్మ.. 65 వన్డేలు ఆడి 67 వికెట్లు మాత్రమే తీశాడు. కేవలం 456 పరుగులు చేశాడు. భారతదేశపు గొప్ప క్రికెటర్లలో ఒకరైన విరాట్ కోహ్లి కెరీర్‌లో అతడు ఇప్పుడు నిర్ణయాత్మక పాత్ర పోషిస్తున్నాడు. దాన్నే మనం ప్రివిలేజ్ అంటామ ని కోహ్లి అభిమాని ఒకరు ట్వీట్ చేశారు.

Also Read: టెస్ట్ ర్యాంకుల్లో నం.1 స్థానానికి టీమిండియా.. మూడు ఫార్మాట్లలోనూ భారత్ అగ్రస్థానం

క్రికెట్ నేడు విరాట్ కోహ్లిని ప్రేమించే వ్యక్తులు, అతడిని ద్వేషించే వ్యక్తులుగా విభజించబడింది. ఇతర ఆటగాళ్లను ఎవరు పట్టించుకుంటారు? నేను దానిని GOAT ప్రభావం అని పిలుస్తాను అంటూ మరో అభిమాని వ్యాఖ్యానించాడు. ఇదిలావుంచితే సొంత మైదానంలో కోహ్లి చెలరేగాలని క్రీడాభిమానులు కోరుకుంటున్నారు.