ICC Test rankings: టెస్ట్ ర్యాంకుల్లో నం.1 స్థానానికి టీమిండియా.. మూడు ఫార్మాట్లలోనూ భారత్ అగ్రస్థానం

ఐసీసీ టెస్ట్ ర్యాంకుల్లో టీమిండియా నంబర్ 1 స్థానానికి చేరుకుంది. దీంతో మూడు ఫార్మాట్లలోనూ అగ్రస్థానంలో నిలిచింది. ఇప్పటికే భారత్ వన్డే, టీ20ల్లో అగ్రస్థానంలో ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన తొలి టెస్టులో టీమిండియా చేతిలో ఆస్ట్రేలియా చిత్తుగా ఓడిపోయింది. దీంతో టీమిండియా ప్రస్తుతం 115 రేటింగ్ తో అగ్రస్థానంలో నిలిచింది.

ICC Test rankings: టెస్ట్ ర్యాంకుల్లో నం.1 స్థానానికి టీమిండియా.. మూడు ఫార్మాట్లలోనూ భారత్ అగ్రస్థానం

ICC Test rankings

ICC Test rankings: ఐసీసీ టెస్ట్ ర్యాంకుల్లో టీమిండియా నంబర్ 1 స్థానానికి చేరుకుంది. దీంతో మూడు ఫార్మాట్లలోనూ అగ్రస్థానంలో నిలిచింది. ఇప్పటికే భారత్ వన్డే, టీ20ల్లో అగ్రస్థానంలో ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన తొలి టెస్టులో టీమిండియా చేతిలో ఆస్ట్రేలియా చిత్తుగా ఓడిపోయింది. దీంతో టీమిండియా ప్రస్తుతం 115 రేటింగ్ తో అగ్రస్థానంలో నిలిచింది.

ఇక ఆస్ట్రేలియా 111 రేటింగ్ తో రెండో స్థానానికి దిగజారింది. ఆ తర్వాతి స్థానంలో ఇంగ్లండ్ 106 రేటింగ్ తో ఉంది. వన్డేల్లో టీమిండియా 114 రేటింగ్ తో అగ్రస్థానంలో, 112 రేటింగ్ తో ఆస్ట్రేలియా రెండో స్థానంలో, 111 రేటింగ్ తో న్యూజిలాండ్ మూడో స్థానంలో ఉన్నాయి. టీ20ల్లో టీమిండియా 267 రేటింగ్ తో అగ్రస్థానంలో, ఇంగ్లండ్ 266 రేటింగ్ తో రెండో స్థానంలో, పాకిస్థాన్ 258 రేటింగ్ తో మూడో స్థానంలో ఉన్నాయి.

టెస్టుల్లో రవిచంద్రన్ అశ్విన్ 846 రేటింగ్ తో ప్రస్తుతం రెండో స్థానంలో ఉన్నాడు. అంతేకాదు, ఆల్ రౌండర్ ర్యాకింగ్స్ లోనూ రెండో స్థానంలో ఉన్నాడు. టెస్ట్ ఆల్ రౌండర్లలో అగ్రస్థానంలో రవీంద్ర జడేజా ఉన్నాడు. ఇటీవల న్యూజిలాండ్ తో జరిగిన వన్డే సిరీస్ లో అద్భుతంగా రాణించిన టీమిండియా ఐసీసీ వన్డే ర్యాంక్సింగ్స్ లో ఎగబాకుతూ వచ్చింది. ఇంగ్లండ్, న్యూజిలాండ్ ను వెనక్కి నెట్టి తాజాగా అగ్రస్థానానికి చేరింది. వన్డే బౌలింగ్ ర్యాంకుల్లో సిరాజ్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

Virat Kohli breaks the internet: కోహ్లి క్రేజ్ మామూలుగా లేదు.. సోషల్ మీడియాను షేక్ చేసేస్తున్నాడు