Virat Kohli Can Break these records in Champions Trophy Final vs New Zealand
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఆఖరి అంకానికి చేరుకుంది. ఆదివారం దుబాయ్ వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరగనున్న ఫైనల్ మ్యాచ్ కోసం అంతా సిద్ధమైంది. అయితే.. ఈ మ్యాచ్‌కు ముందు పరుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీని పలు రికార్డులు ఊరిస్తున్నాయి.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సీజన్‌లో కోహ్లీ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. నాలుగు మ్యాచ్‌ల్లో 72.33 సగటు 83.14 స్ట్రైక్‌రేట/తఓ 217 పరుగులు సాధించాడు. ఇందులో ఓ సెంచరీ, ఓ హాఫ్ సెంచరీ ఉంది.
Mohammed Shami- Javed Akhtar : షమీకి జావేద్ అక్తర్ మద్దతు.. ఆ మూర్ఖులను పట్టించుకోకండి..
వన్డేల్లో న్యూజిలాండ్ పై అత్యధిక పరుగులు..
ఫైనల్ మ్యాచ్‌లో కోహ్లీ 95 పరుగులు చేస్తే.. వన్డేల్లో న్యూజిలాండ్ పై అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా నిలుస్తాడు. ఈ క్రమంలో సచిన్ టెండూల్కర్ రికార్డును బ్రేక్ చేస్తాడు. వన్డేల్లో కివీస్ పై సచిన్ 1750 పరుగులు చేయగా ప్రస్తుతం కోహ్లీ ఖాతాలో 1656 రన్స్ ఉన్నాయి.
వన్డేల్లో కివీస్ పై అత్యధిక సెంచరీలు..
ఫైనల్ మ్యాచ్‌లో కోహ్లీ గనుక శతకంతో చెలరేగితే.. వన్డేల్లో న్యూజిలాండ్ పై అత్యధిక సెంచరీలు చేసిన భారత ఆటగాడిగా రికార్డులకు ఎక్కుతాడు. ప్రస్తుతం ఈ రికార్డు సంయుక్తంగా కోహ్లీ, సెహ్వాగ్ పేరిట ఉంది. వీరిద్దరూ కివీస్ పై వన్డేల్లో చెరో ఆరు శతకాలు బాదారు.
IPL 2025 : ఐపీఎల్‌కు ముందు ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్..
నాకౌట్ మ్యాచ్‌ల్లో అత్యధిక 50+రన్స్..
ఫైనల్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ చేస్తే.. ఐసీసీ నాకౌట్ మ్యాచ్‌ల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా సచిన్‌తో కలిసి నిలుస్తాడు. ఐసీసీ నాకౌట్స్‌లో సచిన్ 6 సార్లు 50+రన్స్ చేయగా, విరాట్ 5 సార్లు ఈ ఘనత సాధించాడు.
నాకౌట్ మ్యాచ్‌ల్లో అత్యధిక పరుగులు..
ఫైనల్ మ్యాచ్‌లో కోహ్లీ 128 పరుగులు సాధిస్తే.. ఐసీసీ నాకౌట్ మ్యాచ్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా చరిత్ర సృష్టిస్తాడు. ఐసీసీ నాకౌట్స్‌లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. సచిన్ ఐసీసీ నాకౌట్స్ మ్యాచ్‌ల్లో 657 పరుగులు చేయగా విరాట్ 530 పరుగులు చేశాడు.