Mohammed Shami- Javed Akhtar : షమీకి జావేద్ అక్తర్ మద్దతు.. ఆ మూర్ఖులను పట్టించుకోకండి..
టీమ్ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ రంజాన్ సందర్భంగా ఉపవాసం ఉండకపోవడంపై తీవ్ర దుమారం చెలరేగుతున్న సంగతి తెలిసిందే

Javed Akhtar defends Mohammed Shami amid Ramadan Controversy
టీమ్ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ రంజాన్ సందర్భంగా ఉపవాసం ఉండకపోవడంపై తీవ్ర దుమారం చెలరేగుతున్న సంగతి తెలిసిందే. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ సందర్భంగా షమీ ఎనర్జీ డ్రింక్ తాగుతూ కనిపించడంతో వివాదం చెలరేగింది.
ముస్లిం మతపెద్ద మౌలానా షాబుద్దీన్ రజ్వే బరేల్వీతో పాటు పలువురు షమీ తీరును తప్పుబట్టారు. అతడిపై విమర్శలు చేస్తున్నారు. కొందరు షమీ చేసిన పనిని తప్పుబడుతుండగా మరికొందరు అతడికి మద్దతుగా నిలుస్తున్నారు.
IPL 2025 : ఐపీఎల్‌కు ముందు ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్..
Shami saheb , don’t give a damn to those reactionary bigoted idiots who have any problem with your drinking water in a burning afternoon at a cricket field in Dubai . It is none of their business. You are one of the great Indian team that is making us all proud My best wishes…
— Javed Akhtar (@Javedakhtarjadu) March 7, 2025
తాజాగా బాలీవుడ్ దిగ్గజ లిరిక్ రైటర్ జావేద్ అక్తర్ కూడా షమీ మద్దతుగా నిలిచాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశాడు.
మ్యాచ్ సమయంలో షమీ నీరు తాగడం కొందరు మూర్ఖులు విమర్శలు చేస్తున్నారు. షమీ సాహెబ్.. మీరు ఆ విమర్శలను పట్టించుకోకండి. అది వాళ్ల పని కాదు. అని జావేద్ అక్తర్ అన్నారు.
మనందరిని గర్వపడేలా చేస్తున్న టీమ్ఇండియా జట్టులో షమీ ఒకరు అని అన్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్‌లో విజేతగా నిలవాలని, ఈ క్రమంలో జట్టు మొత్తానికి శుభాకాంక్షలు తెలియజేశారు.