IPL 2025 : ఐపీఎల్‌కు ముందు ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్..
ఐపీఎల్ 2025 సీజన్‌కు ముందు ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్ తగిలింది.

Big blow for Mumbai Indians ahead of IPL 2025 Report
టీమ్ఇండియా పేస్ గుర్రం జస్‌ప్రీత్ బుమ్రా పోటీ క్రికెట్ ఆడేందుకు మరికొన్నాళ్ల సమయం పట్టవచ్చు. వెన్నుగాయంతో ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి బుమ్రా దూరం అయ్యాడు. ప్రస్తుతం అతడు బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో పునరావాసం పొందుతున్నాడు.
అతడు ఐపీఎల్ నాటికి కోలుకుంటాడని అంతా భావించారు. కానీ ఐపీఎల్‌లో మొదటి లేదా రెండు వారాలు మిస్ అవుతాడని వార్తలు వస్తున్నాయి. అతడు ఏప్రిల్‌లో మాత్రమే ముంబై ఇండియన్స్ శిబిరంలో చేరే అవకాశం ఉందని టైమ్స్ ఆఫ్ ఇండియా తెలిపింది.
‘బుమ్రా వైద్య నివేదికలు బాగానే ఉన్నాయని, అతడు ప్రస్తుతం CoEలో బౌలింగ్ ప్రారంభించాడు. అయితే.. రాబోయే రెండు వారాల్లో ఐపీఎల్ ప్రారంభం కానుంది. కానీ ఏప్రిల్ మొదటి వారంలోనే బుమ్రా తిరిగి పోటీ క్రికెట్‌లోకి వస్తాడు. ‘అని బీసీసీఐ వర్గాలు తెలిపినట్లు వెల్లడించింది.
IND vs NZ : భారత్‌తో ఫైనల్ మ్యాచ్‌కు ముందు న్యూజిలాండ్ కోచ్ కీలక వ్యాఖ్యలు..
అదే జరిగితే.. బుమ్రా ఐపీఎల్ 2025 సీజన్‌లో ముంబై జట్టు ఆడే మొదటి మూడు లేదా నాలుగు మ్యాచ్‌లకు దూరం అవుతాడు. వైద్య బృందం బుమ్రాను నిశితంగా పరిశీలిస్తోందని, కొన్ని రోజులు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అతడు పూర్తి వేగంతో బౌలింగ్ చేయగలిగితే తప్ప, వైద్య బృందం అతడికి క్లియరెన్స్ సరిఫ్టికెట్ ఇచ్చే అవకాశం లేదట.
ఇంగ్లాండ్‌తో సిరీసే ముఖ్యం..
ఐపీఎల్ తరువాత భారత జట్టు ఇంగ్లాండ్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ జరగనుంది. ఈ సిరీస్‌కు బుమ్రాను ఫిట్‌గా ఉంచడమే లక్ష్యంగా బీసీసీఐ పని చేస్తోంది. ఇంగ్లాండ్ పర్యటనలో భారత కెప్టెన్‌గా రోహిత్ ఉంటాడా? లేదా ? అన్నది ఇంకా తెలియరాలేదు. ఈ సిరీస్‌కు రోహిత్ శర్మ దూరం అయితే.. బుమ్రా కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టవచ్చు.
IND vs NZ : ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు ముందు దుబాయ్ పోలీసుల వార్నింగ్..
ఆస్ట్రేలియా పర్యటనలో బుమ్రా పైనే భారత్ ఎక్కువగా ఆధారపడింది. ఈ క్రమంలో ఐదో టెస్టు మ్యాచ్‌లో బుమ్రా గాయపడ్డాడు. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కు బుమ్రాతో పాటు మరో సీనియర్ పేసర్ మహ్మద్ షమీని ఎంపిక చేయాలని బీసీసీఐ సెలక్టర్లు భావిస్తున్నారు. సుదీర్ఘ కాలం తరువాత ఇటీవలే షమీ రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో షమీ పనిభారాన్ని సైతం టీమ్‌మేనేజ్‌మెంట్ జాగ్రత్తగా పర్యవేక్షిస్తోంది. వీరిద్దరిపైనే అతిగా ఆధారపడకుండా యువ పేసర్ల పైనా సెలక్టర్లు దృష్టి సారించినట్లు తెలుస్తోంది.