Virat Kohli : సెంచ‌రీ త‌రువాత విరాట్ కోహ్లీ ఏం చేశాడంటే..? వీడియో వైర‌ల్‌..

Virat Kohli Video : వ‌న్డే క్రికెట్‌లో అత్య‌ధిక శ‌త‌కాలు సాధించిన ఆట‌గాడిగా విరాట్ కోహ్లీ చ‌రిత్ర సృష్టించాడు.

Virat Kohli Video : వ‌న్డే క్రికెట్‌లో అత్య‌ధిక శ‌త‌కాలు సాధించిన ఆట‌గాడిగా విరాట్ కోహ్లీ చ‌రిత్ర సృష్టించాడు. బుధ‌వారం వాంఖ‌డే వేదిక‌గా న్యూజిలాండ్‌తో సెమీ ఫైన‌ల్ మ్యాచ్‌లో కోహ్లీ 106 బంతుల్లో సెంచ‌రీ చేశాడు. వ‌న్డేల్లో ఇది విరాట్ కోహ్లీకి ఇది 50వ శ‌త‌కం. ఈ క్ర‌మంలో స‌చిన్ టెండూల్క‌ర్ రికార్డును బ‌ద్ద‌లు కొట్టాడు. 452 ఇన్నింగ్స్‌ల్లో స‌చిన్ 49 శ‌త‌కాలు చేయ‌గా కేవ‌లం 279 ఇన్నింగ్స్‌ల్లోనే కోహ్లీ 50 సెంచ‌రీలు చేయ‌డం గ‌మ‌నార్హం.

ఈ మ్యాచ్ చూసేందుకు స‌చిన్ టెండూల్క‌ర్ రావ‌డం విశేషం. స‌చిన్ స‌మ‌క్షంలోనే అత‌డి రికార్డును విరాట్ బ‌ద్ద‌లు కొట్టాడు. కాగా.. విరాట్ సెంచ‌రీ చేయ‌గానే స్టేడియంలోని ప్రేక్ష‌కులు మొత్తం స్టాండింగ్ ఒవేష‌న్‌లో చ‌ప్ప‌ట్ల‌తో అత‌డిని అభినందించారు. స‌చిన్ తో పాటు బీసీసీఐ కార్య‌ద‌ర్శి కూడా చ‌ప్ప‌ట్ల‌తో కోహ్లీని ఎంక‌రేజ్ చేశారు. కాగా.. విరాట్ మాత్రం సెంచ‌రీ పూర్తి చేయ‌గానే తాను ఎంత‌గానో ఆరాధించే స‌చిన్ టెండూల్క‌ర్‌కు బోడౌన్ చేస్తూ న‌మ‌స్క‌రించాడు.

Rachin Ravindra : రాహుల్, సచిన్ పేర్ల కలయికతో ‘రచిన్’ పేరు పెట్టారా? అసలు విషయం చెప్పిన రచిన్ తండ్రి

ఇందుకు సంబంధించిన వీడియోను సోష‌ల్ మీడియాలో అంత‌ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) పోస్ట్ చేసింది. ప్ర‌స్తుతం ఈ వీడియో వైర‌ల్‌గా మారింది. దీనిపై నెటీజ‌న్లు త‌మ‌దైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే వ్య‌క్తి విరాట్ కోహ్లీ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. టాస్ గెలిచిన భార‌త్ బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో నాలుగు వికెట్లు న‌ష్టాపోయి 397 ప‌రుగులు చేసింది. భార‌త బ్యాట‌ర్ల‌లో విరాట్ కోహ్లీ (117; 113 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స‌ర్లు), శ్రేయ‌స్ అయ్య‌ర్ (105; 70 బంతుల్లో 4 ఫోర్లు, 8 సిక్స‌ర్లు) శ‌త‌కాలు బాదారు. శుభ్‌మ‌న్ గిల్ (80; 66 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స‌ర్లు) హాఫ్ సెంచరీ చేశాడు. రోహిత్ శ‌ర్మ (47; 29 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స‌ర్లు), కేఎల్ రాహుల్ (39 నాటౌట్; 20 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) రాణించారు. న్యూజిలాండ్ బౌల‌ర్ల‌లో టిమ్ సౌథి మూడు వికెట్లు తీశాడు. ట్రెంట్ బౌల్డ్ ఓ వికెట్ ప‌డ‌గొట్టాడు.

World Cup 2023 Prize Money : మీకు ఇది తెలుసా..? ప్ర‌పంచ‌క‌ప్ విజేత‌కు, గ్రూప్ స్టేజీలో నిష్ర్క‌మించిన జ‌ట్ల‌కు ప్రైజ్‌మ‌నీ ఎంత ఇస్తారో..?

ట్రెండింగ్ వార్తలు