Virat Kohli: కోహ్లీకి రెండో ఏడాదిలోనూ నో సెంచరీ

టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ సెంచరీ లేకుండానే 2021 ఏడాది కూడా పూర్తి చేసేసుకున్నాడు. దక్షిణాఫ్రికా వేదికగా తొలి టెస్టు సెకండ్ ఇన్నింగ్స్‌లో బుధవారం 18పరుగులు మాత్రమే....

Virat Kohli

Virat Kohli: టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ సెంచరీ లేకుండానే 2021 ఏడాది కూడా పూర్తి చేసేసుకున్నాడు. దక్షిణాఫ్రికా వేదికగా తొలి టెస్టు సెకండ్ ఇన్నింగ్స్‌లో బుధవారం 18పరుగులు మాత్రమే నమోదు చేశాడు. 2020లోనూ మూడెంకల స్కోరును చేరలేకపోయాడు విరాట్. చివరిసారిగా కోహ్లీ నమోదు చేసిన అంతర్జాతీయ సెంచరీ 2019లోనే. ఈడెన్స్ గార్డెన్స్ వేదికగా బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లలో ఈ ఫీట్ సాధించాడు.

దక్షిణాఫ్రికా బౌలర్ మార్కో జాన్సెన్ 33వ ఓవర్‌లో కోహ్లీని అవుట్ చేసి సెంచరీ ఆశలను తుడిచేశాడు.

సెంచురియన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టెస్టు మ్యాచ్ లో టీమిండియా గెలుపు దిశగా పయనిస్తోంది. ఈ టెస్ట్ మ్యాచ్ లో విజయానికి 6 వికెట్ల దూరంలో భారత జట్టు ఉంది. 305 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన సఫారీలు నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లకు 94 పరుగులు చేశారు. ఆ జట్టు విజయం సాధించాలంటే ఇంకా 211 పరుగులు చేయాలి.

ఇది కూడా చదవండి : తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు

ఆటకు గురువారం(డిసెంబర్ 30) చివరి రోజు. కాగా, ఊపుమీదున్న టీమిండియా పేసర్లను ఎదుర్కోవడం దక్షిణాఫ్రికా లోయర్ ఆర్డర్ కు సవాలే. ప్రస్తుతం క్రీజులో కెప్టెన్ డీన్ ఎల్గార్ 52 పరుగులతో ఆడుతున్నాడు. ఆట మరికొంచెం సేపట్లో ముగుస్తుందనగా, బుమ్రా ఓ అద్భుతమైన బంతితో నైట్ వాచ్ మన్ కేశవ్ మహరాజ్ ను బౌల్డ్ చేశాడు.

ట్రెండింగ్ వార్తలు