Virat Kohli: క్యాచ్ పట్టానోవ్..! సతీమణికి కోహ్లీ ఫ్లయింగ్ కిస్.. అనుష్క రియాక్షన్ చూశారా..? ఫొటోలు వైరల్..
విరాట్ కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్‌లో 100కుపైగా క్యాచ్‌లను అందుకున్న మూడో క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు.

Virat Kohli kiss
Virat Kohli: ఐపీఎల్ 2023 సీజన్‌లో మ్యాచ్‌లు ఉత్కంఠ భరితంగా సాగుతున్నాయి. చివరి బంతి వరకు ఏ జట్టు విజయం సాధిస్తుందో చెప్పడం కష్టతరంగా మారింది. నువ్వానేనా అన్నట్లు సాగుతున్న మ్యాచ్ లతో క్రికెట్ ఫ్యాన్స్‌కు పండుగ వాతావరణమే. ఆదివారం సాయంత్రం రాజస్థాన్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగింది. కోహ్లీ టీం ఓటమి అంచుల్లోనుంచి పుంజుకొని విజయతీరాలకు చేరింది.
IPL 2023, RCB vs RR: ఉత్కంఠపోరులో కోహ్లి సేనదే విజయం
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది.. డుప్లెసిస్, మ్యాక్స్‌వెల్ వీరవిహారం చేయడంతో 189 పరుగులు చేసింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ జట్టు తొలుత తడబడిన చివరి ఓవర్లలో బ్యాటర్లు విజృంభించారు. యశస్వీ జైస్వాల్, దేవదుత్ పడిక్కల్ దాటిగా ఆడారు. ఈ క్రమంలో అప్పటి వరకు కోహ్లీ సేనవైపు ఉన్న విజయావకాశాలు రాజస్థాన్ జట్టు వైపు మళ్లాయి.
అయితే, హర్షల్ పటేల్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించిన యశ్వసి జైస్వాల్ బౌండరీ లైన్ వద్ద కోహ్లీకి చిక్కాడు. అప్పటి వరకు టెన్షన్ గా కనిపించిన కోహ్లీ.. క్యాచ్ అందుకోగానే అనుష్క శర్మ కూర్చున్న గ్యాలరీ వైపు చూస్తూ ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడు. అనుష్మ శర్మ భర్త మైదానం నుంచి ఫ్లయింగ్ కిస్ ఇస్తుండటంతో నవ్వులు చిందిస్తూ కనిపించింది. ఇందుకు సంబంధించి ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Flying Kiss To Anushka Mam..!! ?❤
Moment hai bhai moment..!! ❤#KingKohli#ViratKohli #AnushkaSharma#RCB#RCBvsRR pic.twitter.com/EeQU7nq4cl— Itz_dinu18 ?? {राधे राधे…} (@Itz_dinu18) April 23, 2023