IPL 2025: బాదుడే బాదుడు.. ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. టాప్-5లో మనోళ్లు ముగ్గురు
ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు.

Virat Kohli (Credit BCCI)
IPL 2025: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఐపీఎల్ లో చరిత్ర సృష్టించాడు. గురువారం ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో కోహ్లీ 22 పరుగులు చేశాడు. ఈ క్రమంలో రెండు సిక్సులు, ఒక ఫోర్ కొట్టాడు. తద్వారా ఐపీఎల్ చరిత్రలో వెయ్యి బౌండరీలు మార్కును చేరుకున్నారు. ఐపీఎల్ చరిత్రలో ఇలా చేసిన తొలి ప్లేయర్ కోహ్లీనే.
Also Read: IPL 2025: అయ్యో.. కొంపముంచావ్ కదయ్యా పాటిదార్.. విరాట్ కోహ్లీ రియాక్షన్ చూశారా.. వీడియో వైరల్
విరాట్ కోహ్లీ ఐపీఎల్ ప్రారంభం నుంచి ఆర్సీబీ జట్టు తరపున ఆడుతున్నాడు. 2008 నుంచి ఇప్పటి వరకు 248మ్యాచ్ లు ఆడాడు. ఈ క్రమంలో అతను 721 ఫోర్లు, 279 సిక్సులు కొట్టాడు. ఈ విధంగా వెయ్యి బౌండరీలు పూర్తి చేసుకున్నాడు. తద్వారా ఐపీఎల్ చరిత్రలో వెయ్యి బౌండరీలు కొట్టిన తొలి ప్లేయర్ గా కోహ్లీ నిలిచాడు. ఈ జాబితాలో శిఖర్ ధావన్ రెండో స్థానంలో ఉన్నాడు. ఐపీఎల్ లో ధావన్ 920 బౌండరీలు బాదాడు.
ఐపీఎల్ లో అత్యధిక బౌండరీలు బాదిన టాప్ ఐదుగురు ఆటగాళ్ల జాబితాలో ముగ్గురు భారత ఆటగాళ్లు ఉన్నారు. ఈ జాబితాలో విరాట్ కోహ్లీ, ధావన్ లతోపాటు రోహిత్ శర్మ కూడా ఉన్నాడు. ప్రస్తుతం వరకు రోహిత్ శర్మ ఐపీఎల్ లో 256 మ్యాచ్ లు ఆడాడు. ఈ క్రమంలో 282 సిక్సులు, 603 ఫోర్లతో మొత్తం 885 బౌండరీలు కొట్టాడు. ఐపీఎల్ లో అత్యధిక బౌండరీలు కొట్టిన బ్యాటర్ల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచాడు. మూడో స్థానంలో డేవిడ్ వార్నర్ ఉన్నాడు. వార్నర్ 899 బౌండరీలు బాదాడు, క్రిస్ గేల్ ఐదో స్థానంలో నిలిచాడు. గేల్ 761 బౌండరీలు బాదాడు.
అత్యధిక బౌండరీలు కొట్టిన ప్లేయర్లు..
విరాట్ కోహ్లీ : 1000 (ఫోర్లు721, సిక్సులు 279)
శిఖర్ ధావన్ – 920 (ఫోర్లు 768, సిక్సులు 152)
డేవిడ్ వార్నర్ – 899 (ఫోర్లు 663, సిక్సులు 236)
రోహిత్ శర్మ – 885 (ఫోర్లు 603, సిక్సులు 282)
క్రిస్ గేల్ – 761 (ఫోర్లు 404, సిక్సులు 357)
సురేశ్ రైనా – 709 (ఫోర్లు 506, సిక్సులు 203)