Virat Kohli : శిఖర్ ధవన్‌ను ఇమిటేట్ చేసిన కోహ్లీ.. వైరల్ వీడియో

టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ నవ్వించడంలో దిట్ట.. అప్పుడప్పుడు సోషల్ మీడియా వేదికగా ఫన్నీ వీడియోస్ షేర్ చేస్తుంటారు.

Virat Kohli : శిఖర్ ధవన్‌ను ఇమిటేట్ చేసిన కోహ్లీ.. వైరల్ వీడియో

Virat Kohli

Updated On : October 18, 2021 / 5:57 PM IST

Virat Kohli : టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ నవ్వించడంలో దిట్ట.. అప్పుడప్పుడు సోషల్ మీడియా వేదికగా ఫన్నీ వీడియోస్ షేర్ చేస్తుంటారు. అవి కోహ్లీ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఇక కోహ్లీ ఇతరులను చక్కగా ఇమిటేట్ చేస్తారు. గతంలో చాలామంది క్రికెటర్లను ఇమిటేట్ చేసి నవ్వులు పూయించారు. ఇక తాజాగా శిఖర్ ధవన్‌ను ఇమిటేట్ చేస్తూ ఓ వీడియో విడుదల చేశారు కోహ్లీ.. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.

చదవండి : IPL 2021 : నడి సముద్రంలో క్రికెట్ ఆడుతూ..ధోనికి శుభాకాంక్షలు

హాయ్ నేను విరాట్ కోహ్లీ.. ఇప్పుడు శిఖర్ ధవన్‌ను మిమిక్ చేస్తాను. ఎందుకంటే అతను ప్రస్తుతం ఆలోచనల్లో మునిగిపోయాడని అనిపిస్తోంది. ధవన్‌ బ్యాటింగ్ చేసే విధానం ఫన్నీగా ఉంటుంది. ఎదుటి క్రీజులో నిలబడి ధవన్ బ్యాటింగ్ చాలాసార్లు చూశా’’ అంటూ కోహ్లీ వీడియోను ప్రారంభించాడు. శిఖర్ లాగానే టీ-షర్ట్ మడిచి బ్యాట్ పట్టాడు.. క్రీజ్ లో ధవన్ స్టైల్‌లో ఇమిటేట్ చేశారు. ఇక ఈ వీడియో చూసిన అభిమానులు తెగ నవ్వుకుంటున్నారు.

చదవండి : IPL 2021: చెన్నై గెలిచింది.. దక్షిణాఫ్రికాను తిట్టిపోస్తున్న డేల్ స్టెయిన్

ఇక ఇదిలా ఉంటే ఇటీవల జరిగిన ఐపీఎల్‌లో కోహ్లీ సారథ్యం వచ్చిన బెంగళూరు జట్టు ప్లేఆఫ్స్ చేరింది. ఇక ఢిల్లీ జట్టుకు సారథ్యం వచ్చిన శిఖర్ జట్టును సెమీఫైనల్ వరకు తీసుకొచ్చాడు. సెమీఫైనల్ లో కోల్ కతా చేతిలో ఓటమి చవిచూశారు. ఇక ఈ సీజన్‌లో 16 మ్యాచులు ఆడిన శిఖర్ ధవన్ 587 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా రికార్డు సృష్టించారు. కానీ అతన్ని టీ20 ప్రపంచకప్‌ జట్టులో ఎంపిక చేయకపోవడం ధవన్ అభిమానులను నిరాశపరిచింది.