Virat Kohli: రికార్డులే రికార్డులు.. కోహ్లి అందుకే ఎమోషన్ అయ్యాడా?

రన్ మెషీన్ గా అభిమానుల ప్రశంసలు అందుకుంటున్న కింగ్ కోహ్లికి రికార్డులు కొత్తేమీకాదు. కానీ బంగ్లాదేశ్ పై సెంచరీ చేయగానే కోహ్లి బాగా ఎమోషన్ అయ్యాడు.

Virat Kohli (Image: @cricketworldcup)

Virat Kohli Records: ఛేజింగ్ తో తనకు తిరుగులేదని టిమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి మరోసారి నిరూపించాడు. వన్డే ప్రపంచకప్ లో భాగంగా గురువారం పుణేలో జరిగిన మ్యాచ్ లో అజేయ సెంచరీతో చెలరేగాడు. అసాధారణ రీతిలో అనూహ్యంగా సెంచరీ బాది తనకు తానే సాటి మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. 97 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సులతో 103 పరుగులు చేసి నాటౌట్‌ గా నిలిచాడు. మరో ఎండ్ లో కేఎల్ రాహుల్ పూర్తి సహకారం అందించడంతో కోహ్లి శతకొట్టాడు.

అంతర్జాతీయ క్రికెట్ లో అత్యధిక సెంచరీలు చేసిన క్రికెటర్ల లిస్ట్ లో 2వ స్థానంలో కొనసాగుతున్న కోహ్లి.. వన్డేల్లో 48వ శతకంతో సచిన్ రికార్డుకు మరింత చేరువయ్యాడు. వన్డేల్లో సచిన్ 49 సెంచరీలు కొట్టాడు. ఇంటర్నేషనల్ క్రికెట్ అత్యధిక రన్స్ చేసిన జాబితాలో 4వ స్థానానికి జంప్ చేశాడు. శ్రీలంక క్రికెట్ దిగ్గజం మహేల జయవర్దనే(25957)ను అధిగమించి 4వ స్థానానికి దూసుకొచ్చాడు. తాజా సెంచరీతో కోహ్లి సాధించిన పరుగుల సంఖ్య 26026కి చేరింది. సచిన్(34357), కుమార సంగక్కర(28016), పాంటింగ్(27483) మాత్రమే కోహ్లి కంటే ముందున్నారు.

అంతేకాదు అత్యంత వేగంగా 26 వేల పరుగులు పూర్తి చేసిన రికార్డు కోహ్లికి దాసోహమైంది. క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న ఈ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. సచిన్ 601 ఇన్నింగ్స్ లో 26 వేల మైలురాయిని చేరుకోగా.. కోహ్లి 567 ఇన్నింగ్స్ లోనూ ఈ ఘనత సాధించాడు. మూడో స్థానంలో బ్యాటింగ్ చేస్తూ వన్డే ప్రపంచకప్ లో 1000 పరుగులు సాధించిన టిమిండియా ఫస్ట్ బ్యాటర్ గానూ కోహ్లి ఖ్యాతికెక్కాడు.

Also Read: అనుకోకుండా.. ఓ బాలుడి కోరికను తీర్చిన కోహ్లీ.. అదే కోరిక‌ను రోహిత్ శ‌ర్మ తీర్చ‌లేక‌పోయాడు..?

రన్ మెషీన్ గా అభిమానుల ప్రశంసలు అందుకుంటున్న కింగ్ కోహ్లి.. ఎనిమిదిన్నరేళ్ల తర్వాత ప్రపంచకప్ లో సెంచరీ సాధించాడంటే ఆశ్చర్యం కలగకమానదు. బహుశా ఇందుకేనేమో నిన్నటి మ్యాచ్ లో సెంచరీ కోసం అతడు అంతగా తపించాడు. శతకం పూర్తి చేసిన తర్వాత కూడా భావోద్వేగానికి గురయ్యాడు. 2015 ఫిబ్రవరిలో అడిలైడ్‌లో పాకిస్తాన్‌ తో జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్ లో 107 పరుగులు చేశాడు. ఇప్పటివరకు ప్రపంచకప్ లో మొత్తం మూడు సెంచరీలు చేశాడు కోహ్లి.

Also Read: ఒలింపిక్స్‌లో రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీ ఆడ‌డం అసాధ్యం..? సూర్య‌కుమార్, పాండ్య‌లు క‌ష్ట‌మేనా..?

 

ట్రెండింగ్ వార్తలు