Virat Kohli joins elite list
పరుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ వన్డే ప్రపంచకప్ 2023లో తన అద్వితీయమైన ఫామ్‌ను కొనసాగించాడు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఆసీస్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 63 బంతులు ఎదుర్కొన్న కోహ్లీ 4 ఫోర్లతో 54 పరుగులు చేశాడు. ఈ క్రమంలో ఓ అరుదైన ఘనతను సాధించాడు. వన్డే ప్రపంచకప్‌లలో ఓ ఎడిషన్‌లో వరుసగా ఐదు మ్యాచుల్లోనూ యాభై కంటే ఎక్కువ పరుగులు చేసిన ఇండియన్ బ్యాటర్‌గా రికార్డులకు ఎక్కాడు. అంతేకాదు.. సెమీ ఫైనల్, ఫైనల్ మ్యాచుల్లో యాభై కంటే ఎక్కువ పరుగులు చేసిన ఏకైక భారత బ్యాటర్‌గా నిలిచాడు.
ఓ ప్రపంచకప్ ఎడిషన్‌లో వరుసగా ఐదు మ్యాచుల్లోనూ 50 ఫ్లస్ స్కోరు ఫీట్‌ను విరాట్ కోహ్లీ రెండు సార్లు అందుకున్నాడు. ప్రస్తుత ఎడిషన్‌తో పాటు 2019లోనూ విరాట్ దీన్ని సాధించాడు. స్టీవ్‌స్మిత్ 2015 ప్రపంచకప్‌లో ఈ ఫీట్‌ను సాధించాడు.
Shubman Gill : ఇది గమనించారా..? అప్పుడు సచిన్.. ఇప్పుడు గిల్.. మామా అల్లుడు మీమ్స్‌తో హల్‌చల్
ఓ ప్రపంచకప్ ఎడిషన్‌లో వరుస మ్యాచుల్లో 50 ఫ్లస్ స్కోరు చేసిన ఆటగాళ్లు..
విరాట్ కోహ్లీ – 5 మ్యాచుల్లో – 2023లో
స్టీవ్ స్మిత్ – 5 మ్యాచుల్లో – 2015లో
విరాట్ కోహ్లీ – 5 మ్యాచుల్లో – 2019లో
శ్రేయస్ అయ్యర్ – 4 మ్యాచుల్లో – 2023లో
కుమార సంగక్కర – 4 మ్యాచుల్లో- 2015లో
Virat Kohli and Steve Smith are the only players to score 5 consecutive half-centuries in the World Cup and Kohli has done it twice now. pic.twitter.com/zitU8xfH6G
— Lubana Warriors (@LovepreetS49) November 19, 2023
ఎలైట్ జాబితాలో చోటు..
ఓ ప్రపంచకప్ ఎడిషన్‌లోని సెమీ ఫైనల్, ఫైనల్ మ్యాచుల్లో వరుసగా అర్ధశతకాలు సాధించిన ఎలైట్ జాబితాలో విరాట్ కోహ్లీ చోటు సంపాదించాడు. న్యూజిలాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో సెంచరీ చేసిన విరాట్ ఫైనల్ మ్యాచులో హాప్ సెంచరీ చేశాడు. మైక్ బ్రేర్లీ (1979), డేవిడ్ బూన్ (1987), జావేద్ మియాందాద్ (1992), అరవింద డి సిల్వా (1996), గ్రాంట్ ఇలియట్ (2015), స్టీవెన్ స్మిత్ (2015) ఈ అరుదైన జాబితాలో ఉన్నారు.
అత్యధిక పరుగుల వీరుడు..
వన్డే ప్రపంచకప్ 2023లో విరాట్ కోహ్లీ 11 మ్యాచుల్లో 95.63 సగటుతో 765 పరుగులు చేశాడు. ఓ ప్రపంచకప్ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. గతంలో ఈ రికార్డు సచిన్ పేరిట ఉంది. సచిన్ టెండూల్కర్ 2003 ప్రపంచప్‌లో 673 పరుగులు చేశాడు.
Rohit Sharma : రోహిత్ శర్మ అరుదైన ఘనత.. ప్రపంచ కెప్టెన్లలో ఒకే ఒక్కడు
THE DREAM WORLD CUP ENDS FOR KING KOHLI…!!!
– 765 runs.
– 95.63 average.
– 6 fifties.
– 3 centuries.
– Hundred in Semis.
– Fifty in Final.An all time great World Cup edition by a player….!!!! ? pic.twitter.com/Q6U4ZsSN5a
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 19, 2023