Rohit Sharma : రోహిత్ శ‌ర్మ అరుదైన ఘ‌న‌త‌.. ప్ర‌పంచ‌ కెప్టెన్ల‌లో ఒకే ఒక్క‌డు

Captain Rohit Sharma : వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో రోహిత్ శ‌ర్మ అరుదైన ఘ‌నత సాధించాడు. ఓ వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ ఎడిష‌న్‌లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన కెప్టెన్‌గా రికార్డుల‌కు ఎక్కాడు.

Rohit Sharma : రోహిత్ శ‌ర్మ అరుదైన ఘ‌న‌త‌.. ప్ర‌పంచ‌ కెప్టెన్ల‌లో ఒకే ఒక్క‌డు

Rohit Sharma

వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో రోహిత్ శ‌ర్మ అరుదైన ఘ‌నత సాధించాడు. ఓ వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ ఎడిష‌న్‌లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన కెప్టెన్‌గా రికార్డుల‌కు ఎక్కాడు. న‌రేంద్ర మోదీ స్టేడియంలో ఆస్ట్రేలియాతో ఫైన‌ల్ మ్యాచ్‌లో రోహిత్ ఈ ఘ‌న‌త‌ను అందుకున్నాడు. ఈ క్ర‌మంలో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలిమ‌య్స‌న్ రికార్డును బ‌ద్ద‌లు కొట్టాడు. విలిమ‌య్స‌న్ 578 ప‌రుగులు చేయ‌గా ఫైన‌ల్ మ్యాచ్‌లో రోహిత్ 29 ప‌రుగుల వ్య‌క్తిగ‌త స్కోరు వ‌ద్ద బ్రేక్ చేశాడు. వీరిద్ద‌రి త‌రువాతి స్థానాల్లో జ‌య‌వ‌ర్థ‌నే, రికీ పాంటింగ్‌లు ఉన్నారు.

ప్ర‌పంచ‌క‌ప్‌లో ఓ ఎడిష‌న్‌లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన కెప్టెన్లు వీరే..

రోహిత్ శర్మ (భార‌త్)- 11 ఇన్నింగ్స్‌లు – 597 ప‌రుగులు – 2023
కేన్ విలియమ్సన్ (న్యూజిలాండ్‌)- 10 ఇన్నింగ్స్‌లు – 578 ప‌రుగులు – 2019
మహేల జయవర్ధనే (శ్రీలంక‌)- 11 ఇన్నింగ్స్‌లు – 548 ప‌రుగులు – 2007
రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా)- 11 ఇన్నింగ్స్‌లు – 539 ప‌రుగులు – 2007
ఆరోన్ ఫించ్ (ఆస్ట్రేలియా)- 10 ఇన్నింగ్స్‌లు – 507 ప‌రుగులు – 2019

Virat Kohli : ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్ మ్యాచ్‌కు ముందు విరాట్ కోహ్లీకి ప్ర‌త్యేక బ‌హుమ‌తి ఇచ్చిన స‌చిన్‌..

ఫైన‌ల్ మ్యాచ్‌లో రోహిత్ శ‌ర్మ 31 బంతులు ఎదుర్కొని 4 ఫోర్లు, 3 సిక్స‌ర్లు బాది 47 ప‌రుగులు చేశాడు. దీంతో ఈ మెగాటోర్నీలో అత్య‌ధిక ప‌రుగులు చేసిన రెండో ఆట‌గాడిగా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో మూడు సిక్స‌ర్లు కొట్ట‌డంతో ఓ ప్ర‌త్య‌ర్థి పై వ‌న్డేల్లో అత్య‌ధిక సిక్స‌ర్లు కొట్టిన ఆట‌గాడిగా చరిత్ర సృష్టించాడు. ఈ క్ర‌మంలో గేల్ రికార్డు బ‌ద్ద‌లు కొట్టాడు.

వ‌న్డేల్లో ఓ ప్ర‌త్య‌ర్థి జ‌ట్టుపై అత్య‌ధిక సిక్స‌ర్లు కొట్టిన ఆట‌గాళ్లు..

రోహిత్ శర్మ – ఆస్ట్రేలియా పై 86 సిక్స‌ర్లు
క్రిస్ గేల్ – ఇంగ్లాండ్ పై 85 సిక్స‌ర్లు
షాహిద్ అఫ్రిది – శ్రీలంక పై 63 సిక్స‌ర్లు
సనత్ జయసూర్య – పాకిస్థాన్ పై 53 సిక్స‌ర్లు

World Cup Craze : క్రేజ్ ఆఫ్ వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్‌.. ప‌రీక్ష‌లు వాయిదా..

ఈ ప్ర‌పంచ‌క‌ప్‌లో 5 సార్లు 40- 49 ప‌రుగుల మ‌ధ్య రోహిత్ శ‌ర్మ..

భార‌త కెప్టెన్ రోహిత్ శ‌ర్మ ఈ ప్ర‌పంచ‌క‌ప్‌లో మెరుపు ఆరంభాల‌ను అందిస్తున్నాడు. అయితే వాటిని భారీ స్కోర్లుగా మ‌ల‌చ‌లేక‌పోతున్నాడు. 40 నుంచి 49 ప‌రుగుల మ‌ధ్య రోహిత్ శ‌ర్మ 5 సార్లు ఔటైయ్యాడు. బంగ్లాదేశ్ పై 48 (40 బంతుల్లో), న్యూజిలాండ్ పై 46 (40), ద‌క్షిణాఫ్రికా 40 పై (27 బంతుల్లో), న్యూజిలాండ్ పై 47 (29బంతుల్లో ), ఆస్ట్రేలియా 47 (31 బంతుల్లో)